డైరెక్టర్ తో నదియా రొమాన్స్!

Nadhiya To Romance With SJ Surya in Mahesh Murugadoss Film

10:24 AM ON 18th July, 2016 By Mirchi Vilas

Nadhiya To Romance With SJ Surya in Mahesh Murugadoss Film

ఒకప్పుడు హీరోయిన్ గా ఎంటర్ అయి, తక్కువ సినిమాలతోనే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన నటి నదియా పెళ్లి , పిల్లలు అన్నీ అయ్యాక , అత్త , అమ్మ పాత్రలతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా ఈమె గురించి ఓ కొత్త న్యూస్ వైరల్ అయింది. అత్తారింటికి దారేదిలో గ్లామర్ అత్తగా నటించి ప్రేక్షకుల మెప్పుపొందిన ఈమె.. ఓ స్టార్ డైరెక్టర్ తో రొమాన్స్ చేస్తుందనే వార్త తో అందరూ ఒకటే గుసగుసలు. ఎట్ ప్రజెంట్ నదియా కొన్ని సినిమాలతో బిజీగా వుంది. ఇదిలావుండగా మహేష్- మురుగదాస్ కాంబినేషన్ లో రానున్న న్యూప్రాజెక్ట్ లోనూ ఛాన్స్ దక్కించుకున్న ఈమె రొమాన్స్ సీన్స్ లో నటించబోతోందట.

ఇందులో విలన్ గా నటిస్తున్న డైరెక్టర్ ఎస్ జె సూర్యకి వైఫ్ గా నదియా కనిపించనుందట. అంతేకాదు ఈ మూవీలో సూర్య- నదియాలకు లవ్ ట్రాక్ అద్భుతంగా వుంటుందని, రొమాన్స్ లో కొంతసేపు ఆడియన్స్ ని అలరిస్తారని ఇన్ సైడ్ నుంచి వస్తున్న వార్త. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లలేదు. ఇంతలోనే ఈ రూమర్లు ఏంటంటూ సినీ లవర్స్ అంటున్నారు. రైట్ టైమ్ లో ఈ ఫిల్మ్ సెట్స్ పైకి వెళ్తే.. ఇంకెన్ని గాసిప్స్ హల్ చల్ చేస్తాయో మరి.

ఇవి కూడా చదవండి:హాట్ సన్నీ కోసం వెతుకులాటలో సరికొత్త రికార్డు

ఇవి కూడా చదవండి:ఇంట్లోనే KFC ఫ్రైడ్ చికెన్ చేస్కోండిలా..

English summary

Veteran Heroine Nadhiya was acted in few films as heroine and she started her second innigs with the film Attarintiki Daredi and now she signed a film which was going made on Mahesh Babu and the director was A.R.Murugadoss and recent gossip that Nadhiya was going act a wife of Vilan S.J.Suryain the film and there were some romantic scenes between them.