అల్లూరి సీతారామరాజుగా ప్రిన్స్ సన్

Nadiminti Plans To Make film Alluri Sitarama Raju With Gautham

11:24 AM ON 16th August, 2016 By Mirchi Vilas

Nadiminti Plans To Make film Alluri Sitarama Raju With Gautham

అల్లూరి సీతారామరాజు పేరు చెప్పగానే తెలుగువాడి పౌరుషాకాగ్ని ఏమిటో వెల్లడవుతుంది. బ్రిటీష్ సామ్రాజ్య వాదుల్ని గడగడ లాడించిన అల్లూరి జీవిత్రం స్పీహూర్తిదాయకం. అలనాటి సూపర్ స్టార్ కృష్ణ 100వ సినిమాగా అప్పట్లో వచ్చిన అల్లూరి సీతారామరాజు మూవీ సంచలన విజయం సాధించి ఆయన కెరీర్ ని పీక్స్ తీసుకువెళ్ళింది. ఆ సినిమాలో కృష్ణ చేసిన పెర్ఫార్మెన్స్, కైమాక్స్ లో చెప్పిన డైలాగ్స్ నేటికీ కృష్ణ అభిమానులనే కాకుండా, చూసిన వారందరికీ రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి.

అయితే కృష్ణ తనయుడు మహేష్ బాబు ని కూడా సీతారామరాజు పాత్రను ఓ సినిమాలో వేయించడంతో పాటు రెండుమూడు సినిమాల్లో అల్లూరి ప్రస్తావన కూడా తెచ్చారు. ఇక ప్రిన్స్ మహేష్ కొడుకు గౌతమ్ కృష్ణతో ‘అల్లూరి సీతారామరాజు’ తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఓ సీనియర్ రైటర్ ప్రయత్నం చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి కొంచెం వివరాల్లోకి వెళ్తే, కృష్ణవంశీ మొదటి సినిమా ‘గులాబి’, రామ్ గోపాల్ వర్మ ‘అనగనగా ఒక రోజు’ సినిమాల రైటర్ నడిమింటి నరసింగరావు. ఇపుడు గౌతమ్ తో అల్లూరి సీతారామరాజు తెరకెక్కించే పనిలో వున్నారు. ఆయన ఈ సినిమా గురించి ఎంతో రీసెర్చ్ వర్క్ చేసి ‘రామరాజు’ స్వాతంత్ర్య పోరాట యోధుడిగా మారడానికి చిన్నతనంలో ఎటువంటి సంఘటనలు ప్రభావితం చేసాయి అనే కథాంశంతో ‘శ్రీరామరాజు’ స్క్రిప్ట్ రెడీ చేసారట.

అయితే అలనాటి అల్లూరి సీతారామరాజు లా కాకుండా బాల్యం నుండి ఎనిమిదవ తరగతి చదివే వరకూ రామరాజు జీవితంలో జరిగిన సంఘటనలు.. వాటి వల్ల ప్రభావితమైన అతను స్వాతంత్ర పోరాట యోధుడిగా మారడం వంటి అంశాలున్న తన స్క్రిప్ట్ కి గౌతం యాప్ట్ అని, అందుకే అతనితో చేసేందుకు ప్రయత్నాల్లో వున్నారని తెలుస్తోంది. ఇక తనని అల్లూరి సీతారామరాజు సినిమా ఎంతో ప్రభావితం చేసిందనే కృష్ణ వంశీ చెబుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ మూవీ డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అన్నీ కుదిరితే.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుందన్నమాట. అదే జరిగితే సూపర్ స్టార్ అభిమానులకు పసందుగా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఓ చారిత్రాత్మక చిత్రాన్ని ఈ విధంగా చిత్రరూపం కల్పించే యత్నం చేయడం అభినందనీయమే.

ఇది కూడా చూడండి: షర్ట్స్ కి లెఫ్ట్ లోనే జేబులు ఎందుకుంటాయో తెలుసుకోండి

ఇది కూడా చూడండి: 1990 తర్వాత పుట్టినోళ్లు శృంగారానికి దూరమవుతున్నారా?

ఇది కూడా చూడండి: ధనవంతులు అవ్వాలని ఉందా? అయితే ఈ కాయిన్స్ ఉండాల్సిందే

English summary

Nadiminti narasingarao Plans To Make film Alluri Sitarama Raju With mahesh babu son Gautham.