మెగా డాటర్ కి ఆడీ కార్ గిఫ్ట్ ఎవరిచ్చారంటే..

Naga Babu gave Audi car gift for his daughter

01:07 PM ON 14th June, 2016 By Mirchi Vilas

Naga Babu gave Audi car gift for his daughter

అవును మెగా డాటర్ నిహారికకు ఆడీ కార్ గిఫ్ట్ గా ఇచ్చారు. అంత విలువైన గిఫ్ట్ నిహారికకు ఎవరిచ్చారో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. తండ్రి పై ప్రేమతో ఖరీదైన కారును గిఫ్టిచ్చాడు తనయుడు. ఇప్పుడేమో కూతురి పై ప్రేమతో తండ్రి గిఫ్టిచ్చాడు. మెగా కుటుంబంలోని అనుబంధాల సంగతి ఇది. వారసులు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాక నాగబాబు చాలా ఖుషీగా ఉన్నాడు. ఇద్దరూ కూడా తొలి అడుగుల్లోనే మంచి ప్రతిభావంతులు అనిపించుకొన్నారు. ఏ తండ్రికైనా అంతకంటే సంతోషమేముంటుంది? అందుకే తన వారసుల్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు నాగబాబు.

స్వయంగా సంపాదించిన రెమ్యునరేషన్ తో వరుణ్ తేజ్ తన తండ్రి నాగబాబుకి ఇటీవల ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడే అదే ప్రేమని తన కూతురి పై చూపిస్తూ ఆడీ కారును కొని తన కూతురికి బహుమతిగా ఇచ్చాడు నాగబాబు. నిహారిక ఇటీవలే కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన ఒక మనసు చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నాగబాబు ముందుగానే ఆమెకి గిఫ్టిచ్చాడు. దీంతో నిహారిక సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.

English summary

Naga Babu gave Audi car gift for his daughter