నిహారిక కు వార్నింగ్ ఇచ్చిన నాగబాబు

Naga Babu Serious Warning To Niharika

03:47 PM ON 8th June, 2016 By Mirchi Vilas

Naga Babu Serious Warning To Niharika

ఈటీవి లో వచ్చిన ఢి జూనియర్స్ కార్యక్రమంలో తన యాంకరింగ్ తో మంచి పేరు సంపాదించుకుంది మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక. కేవలం యాంకరింగ్ తోనే ఆగిపోకుండా "ఆవకాయ బిరియాని" వంటి షార్ట్ ఫిల్మ్స్ తో నిహారిక నటన పరంగా కుడా మంచి మార్కులే తెచ్చుకుంది. ఇటీవల నిహారిక హీరోయిన్ గా మారి "ఒక మనసు" అనే సినిమాలో కుడా నటించింది.

ఈ సినిమాలో నిహారిక సరసన యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తుండగా, దర్శకుడు రామరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తన ముద్దుల కూతురు నిహారిక సినిమాల్లోకి వస్తానంటే ఒప్పుకున్న నాగబాబు ఇటీవల తన ముద్దుల కూతురికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట. ఇంతకి నాగబాబు నిహారికకు అంత సీరియస్ వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా!

తాను నటించిన మొదటి సినిమా ఇంకా విడుదల కాకుండానే వరుస ఆఫర్ లు వస్తుండడంతో నిహారిక సినిమా కథలు వినకుండానే ఆడ్వాన్స్ లు తీసుకుందట. ఈ విషయం తెలిసిన నాగబాబు నిహారిక పై సీరియస్ అయ్యాడని సమాచారం. అంతేకాకుండా ఎలాంటి టాప్ హీరోతో సినిమా అయినా సరైన కథ లేకుంటే ఫ్లొప్ అవుతున్నాయని, కథ నచ్చితే అడ్వాన్స్ లు తీసుకోవాలి కానీ, కథ వినకుండానే డబ్బులు తీసుకోవడం సరికాదని నాగబాబు నిహారికకు గట్టిగా వార్నింగ్ తో పాటు క్లాసు కుడా పీకాడట.

ఇవి కూడా చదవండి:జూన్ 20న ఫస్ట్ షాట్ కి ముహూర్తం రెడీ...

ఇవి కూడా చదవండి:బికినీలో బిగ్ బి మనవరాలు రెచ్చిపోయింది (వీడియో)

English summary

Mega Brother Daughter Niharika was famous by the Tv shows and she acted as heroine in the movie Named "Oka Manasu" and recently she was warned seriously by her fathet Naga Babu because of she was taking advance amount without listening the movie story.