నాన్నకు ప్రేమతో... ఇట్లు చైతూ-అఖిల్

Naga Chaitanya and Akhil released Nagarjuna postal stamps

11:35 AM ON 30th August, 2016 By Mirchi Vilas

Naga Chaitanya and Akhil released Nagarjuna postal stamps

కావాల్సింది సమకూర్చే తండ్రి ఉంటే ఆ కొడుకులకు ఆనందం కాక మరేమిటి. అందుకే ఈ కుర్ర హీరోలు నాన్నపై ప్రేమతో ఏమన్నారంటే, కుర్రాళ్లమైన మేం ఏం చేయాలో అవన్నీ నాన్నగారు చేసి చూపిస్తున్నారు. ఇప్పటికీ మాలో స్ఫూర్తి నింపుతున్నారు అని నాగచైతన్య, అఖిల్ చెప్పుకొచ్చారు. సోమవారం నాగార్జున పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లో నాగార్జున ఛాయాచిత్రంతో రూపొందించిన ప్రైవేటు పోస్టల్ స్టాంపుని ప్రత్యేకంగా విడుదల చేశారు. 'నిర్మలా కాన్వెంట్' చిత్రంలో నాన్నగారు ఓ పాట పాడారు. ఆ పాట విని సంతోషపడ్డా. ఇప్పుడు నాన్నగారి పేరుమీద ఓ పోస్టల్ స్టాంపు విడుదల కావడం ఇంకా ఆనందాన్ని కలిగిస్తోంది అని నాగచైతన్య అన్నాడు.

'శివ నుంచి సోగ్గాడే చిన్నినాయన' వరకూ నాన్నగారు ఏం చేసినా అది ట్రెండుగా మారింది. మేమంతా ఆయన బాటలోనే నడుస్తాం అని అఖిల్ చెప్పాడు. సంగీత దర్శకుడు రోషన్ చెబుతూ నిర్మలా కాన్వెంట్ లోని 'కొత్త కొత్త భాష..' పాట మీరే పాడాలని నాగార్జున గారిని అడిగా. నే పాడితే బాగుంటుందా, పాడమంటావా అంటూ హుషారుగా పాట పాడేశారు. ఆ పాటకు మంచి స్పందన లభించింది అన్నాడు.

ఇది కూడా చదవండి: అతని ప్రాణాలు తీసిన అద్భుత సాహసం(వీడియో)

ఇది కూడా చదవండి: శని వున్నవారు ఈ పత్రాలతో శివుడ్ని పూజిస్తే శని పోతుందట!

ఇది కూడా చదవండి: గుడికి వెళ్ళేటప్పుడు గంట కొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి?

English summary

Naga Chaitanya and Akhil released Nagarjuna postal stamps. Akkineni Naga Chaitanya and Akkineni Akhil released postal stamps of Nagarjuna in the ocassion of Nagarjuna's birthday.