పెళ్ళిలో సందడి చేసిన చైతూ-సమంత జంట(ఫోటోలు)

Naga Chaitanya and Samantha in Nimmagadda Prasad daughter's marriage

03:12 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Naga Chaitanya and Samantha in Nimmagadda Prasad daughter's marriage

ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతికి, ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్ యజమాని శివకుమారెడ్డి కుమారుడు ప్రణవ్ రెడ్డికి ఆదివారం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో వివాహం జరిగింది. ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. టాలీవుడ్ అందాల జంట.. నాగచైతన్య, సమంత ఆదివారం జరిగిన ఈ వివాహ వేడుకకు హాజరై సర్ప్రైజ్ చేసారు. టాలీవుడ్ అందాల జంట అక్కడ ప్రత్యక్షమవ్వడంతో అందరి కళ్ళు అటే మళ్ళాయి. చైతూ, సమంత పెళ్లి గురించి చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి అవుననో, కాదనో వారు తేల్చిచెప్పలేదు.

సమంత తన మెడలో ఎన్ అనే అక్షరం లాకెట్ ధరించి, తన జీవితంలో ఎంతో ముఖ్యమైందని చెప్పడం తప్ప ఇద్దరూ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరవడం ఇదే మొదటిసారి. అయితే నాగార్జున, అఖిల్ కూడా వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలపై మీరు లుక్కెయ్యండి.

1/9 Pages

English summary

Naga Chaitanya and Samantha in Nimmagadda Prasad daughter's marriage. Akkineni Nagarjuna, Akhil, Naga Susheela, Naga Chaitanya and Samantha attends for Nimmagadda Prasad daughter's marriage.