చైతూ-సమంతల పెళ్లి డేట్ ఫిక్స్

Naga Chaitanya and Samantha marriage date was fixed

10:30 AM ON 15th July, 2016 By Mirchi Vilas

Naga Chaitanya and Samantha marriage date was fixed

ఎట్టకేలకు నాగచైతన్య, సమంతల ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వచ్చేసింది. ఇన్నాళ్లూ ఓపెన్ సీక్రెట్ గా ఈ వ్యవహారం ఉంది. వాళ్లంతట వాళ్లు బయట చెప్పుకోకపోయినా, వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని టాలీవుడ్ లో అందరికీ తెలిసిపోయింది. చైతూ ప్రేమ పెళ్లికి ఇంట్లో వాళ్లందరి మద్దతూ లభించింది. నాగార్జున కూడా ఈ విషయాన్ని బాహాటంగానే ప్రకటించాడు. ఇక వీరిద్దరి పెళ్లికి మార్గం సుగమం అవ్వడంతో, ఇప్పుడు పెళ్లికి డేట్ కూడా ఫిక్సయిపోయినట్టు టాక్ నడుస్తోంది. సెప్టెంబరు ఆఖరి వారంలో చైతూ, సమంతల పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారట.

అన్నపూర్ణ స్టూడియోలో గానీ, హైదారాబాద్ లోని నోవెటెల్ ప్రాంగణంలో గానీ వివాహం జరపాలని నాగ్ భావిస్తున్నాడట. అంతేకాదు అఖిల్ పెళ్లి కూడా జోడించి ఒకేసారి, ఇద్దరికీ పెళ్లి జరపాలని నాగ్ అనుకున్నా, ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని మార్చుకొన్నట్టు కొత్తగా వస్తున్న టాక్. చైతూ, సమ్మూల పెళ్లి ఏ రేంజ్ లో ఉండబోతోందో మరి.

English summary

Naga Chaitanya and Samantha marriage date was fixed