చైతూ-సమంతాల కల్యాణం ఫిక్స్!

Naga Chaitanya and Samantha new movie title Kalyanam

04:55 PM ON 28th June, 2016 By Mirchi Vilas

Naga Chaitanya and Samantha new movie title Kalyanam

అక్కినేని నాగచైతన్య - సమంత పీకల్లోతు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే ఓ ఇంటివాళ్లు కాబోతున్నారని కొంతకాలంగా వస్తున్న వార్తలకు కొదవే లేదు. ఇదిలా ఉంటే, ఈ జంటకి శుభంకార్డు పడేలా సెట్ అయింది వాళ్లు నటించబోతోన్న కొత్త సినిమా టైటిల్. చైతూ-సమంత హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తోన్న సినిమాకి 'కళ్యాణం' టైటిల్ ఖరారు చేశారు. సోగ్గాడే చిన్నినాయన చిత్రంతో అక్కినేని ఫ్యామిలీకి బాగా దగ్గరైన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రం నాగచైతన్య కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమాగా ఉన్నాడు. మరి నాగార్జునకి ఇచ్చినట్లు నాగచైతన్యకు కూడా కళ్యాణ్ కృష్ణ మంచి బ్రేక్ ఇస్తాడో లేదో చూడాలి.

అటు సమంతా కూడా ఈ చిత్రంలో చాలా కష్టమైన పాత్రలో నటించబోతుందని సమాచారం. మొత్తం మీద ఈ విధంగా అయినా చైతూ-సమంతాల పెళ్లి ఫిక్స్ అయిందని అనుకుంటున్నారు.

English summary

Naga Chaitanya and Samantha new movie title Kalyanam