అందుకే చైతూ మిస్సయాడు

Naga Chaitanya Away From Rama Naidu 80th Birthday Celebrations

12:43 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Naga Chaitanya Away From Rama Naidu 80th Birthday Celebrations

ఇటీవల స్టార్ ప్రొడ్యూసర్ దివంగత డాక్టర్ డి. రామానాయుడు 80 వ జయంతి కార్యక్రమానికి ఆయన ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయింది. ఘనంగా నివాళులు అర్పించారు. నిర్మాత సురేష్ బాబు, హీరో వెంకటేష్, రానా.. ఇలా కుటుంబ సభ్యులంతా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అయితే ఒకే ఒక్కడు డుమ్మా కొట్టాడు. అదేనండీ, రామానాయుడు మనవడు, నాగార్జున తనయుడు అయిన హీరో నాగ చైతన్య హైదరాబాద్ లోనే ఉన్నా సరే గైర్హాజరయ్యాడు.. అయితే ఎందుకా అని ఆరా తీస్తే, అసలు విషయం తెల్సిందట.

తనకు, హీరోయిన్ సమంతకు మధ్య లవ్ అఫైర్ ఉన్నట్టు మీడియాలో గుప్పుమంటూ గాసిప్స్ రావడంతో, ఈ కార్యక్రమానికి వస్తే....అంతా తనను ఇది నిజమేనా అని గుచ్చి గుచ్చి అడిగే ప్రమాదం ఉందని ఊహించే చైతూ రాలేదని తెల్సింది. దీన్నిబట్టి ఇన్ డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టేగా. ఇక సమ్మూ ఈ మధ్య తమ ప్రేమాయణం గురించి ఏదో ఒక సందర్భంలో చెప్పెస్తూనే వుంది. మొత్తానికి వీళ్ళిద్దరూ బాహాటంగా బయటపడక పోయినా వీరి జంట ఫోటోలు దర్శనమిస్తున్న తీరు సమ్ సమ్ థింగ్ అంటూ ఊరిస్తున్నాయి. మరి ఈ సస్పెన్స్ నుంచి ఎప్పుడు బయట పడతారో చూడాలి.

ఇవి కూడా చదవండి:ఆ డైరెక్టర్ లైంగికంగా వేధించాడు...

ఇవి కూడా చదవండి:ఈమెతో ప్రేమలో పడ్డప్పుడు ఎన్టీఆర్ ఫోన్ బిల్ తెలిస్తే షాకౌతారు!

English summary

Young Hero Akkineni Naga Chaitanya was not attended to his Grand Father Legendary Producer Daggubati Rama Naidu's 80th Birthday Celebrations and recently a news came to know that the reason behind he was absent to that because there every one will ask about the relation with Samantha.