చైతూని మోసం చేసిన అసిస్టెంట్‌

Naga Chaitanya Dismisses His Assistant

12:39 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Naga Chaitanya Dismisses His Assistant

స్టార్ల పేర్లు చెప్పి వాళ్ళ అసిస్టెంట్లో లేక అభిమానులో క్యాష్‌ చేసుకుంటున్న సంఘటనలు ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి. నారా రోహిత్‌ అభిమానిని అని చెప్పి లక్షలు లక్షలు టోకరా పెట్టిన సంఘటన మరువక ముందే మరొక విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం 'మజ్ను' చిత్రంలో నటిస్తున్నాడు. ఇది మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన 'ప్రేమమ్‌' చిత్రానికి రీమేక్‌. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన శృతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'కార్తికేయ' ఫేమ్‌ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కొద్ది రోజుల క్రితమే వైజాగ్‌లోని ఒక కళాశాలలో జరిగిన విషయం తెలిసిందే. అయితే అక్కడ స్టూడెంట్స్‌ చైతూతో ఫోటోలు దిగాలని ఆ కళాశాల ప్రిన్సిిపాల్‌ని కోరారట. దీనితో ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ చైతూ అసిస్టెంట్‌ వేణుకి ఆ విషయం చెప్పాడట. దానికి చైతూ అసిస్టెంట్‌ వేణు కొన్ని లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. దీనితో ఖంగుతిన్న ప్రిన్సిపాల్‌ ఆ విషయాన్ని వెంటనే చైతూకి చెప్పాడట. ఆ విషయం విని షాక్‌ తిన్న చైతూ వెంటనే ఆ అసిస్టెంట్‌ని పనిలో నుండి పీకేసి చివాట్లు కూడా పెట్టాడట. ఏదేమైనా ఆ అసిస్టెంట్‌ చైతూ ఇమేజ్‌ని ఇలా పాడు చేశాడని చైతూ తెగ ఫీలయ్యాడంట.

English summary

Tollywood Young Hero Naga Chaitanya Fires on his Assistant. Naga Chaitanya Dismissed his Assistant because presently Naga Chaitanya was acting in Majnu Movie.This movie shooting was doing in a college in Vizag.That college principal asked Naga Chaitanya assistant to take photos with their students and then his assistant asked lakhs of money to take photo with naga chaitanya.Then Naga Chaitnaya came to know this and scolded his assistant and dismissmed him as his assistant