అ ఆ సినిమా మిస్ చేసుకున్నందుకు బాధపడుతున్నా.. ఆ హీరో ఎవరో తెలుసా?

Naga Chaitanya feeling sad for rejecting A Aa movie

01:31 PM ON 11th June, 2016 By Mirchi Vilas

Naga Chaitanya feeling sad for rejecting A Aa movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన తాజా చిత్రం 'అ.. ఆ..'. నితిన్-సమంత జంటగా నటించిన ఈ చిత్రం జూన్ 2న విడుదలై ప్రేక్షకులని బాగా అలరిస్తుంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రాన్ని యువ కధానాయకుడు మిస్ చేసుకున్నందుకు ఎంతగానో బాధ పడుతున్నాడట. ఇంతకీ ఎవరా హీరో? అది తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్ళాల్సిందే.. మొదట ఈ చిత్రాన్ని యువ కధానాయకుడు అక్కినేని నాగచైతన్య దగ్గరకి అ.. ఆ.. కధ తీసుకు వెళ్ళాడట. అయితే నాగచైతన్య ఈ కధకి నో చెప్పడంతో ఆ తరువాత త్రివిక్రమ్ నితిన్ ని సంప్రదించాడట.

దీనికి నితిన్ వెంటనే ఓకే చెప్పడంతో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని నితిన్ తో తెరకెక్కించాడు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి 8 రోజుల్లోనే 60 కోట్లు గ్రాస్ ని కలెక్ట్ చేసింది ఈ సినిమా. అయితే నాగచైతన్య ఈ చిత్రాన్ని వదిలేసి చందు మొండేటి దర్శకత్వంలో ప్రేమం అనే చిత్రంలో నటించడానికి అంగీకరించాడు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ చిత్రం తనని మరో మెట్టు ఎక్కిస్తుందని నాగచైతన్య భావిస్తున్నాడు. ఏమవుతుందో చూద్దాం మరి.

English summary

Naga Chaitanya feeling sad for rejecting A Aa movie