తండ్రి మాటకంటే తల్లి మాటకే విలువిచ్చిన చైతూ

Naga Chaitanya gives more importance to his mother than father

12:43 PM ON 9th July, 2016 By Mirchi Vilas

Naga Chaitanya gives more importance to his mother than father

అక్కినేని నాగచైతన్య-సమంత పెళ్లికి గ్రీన్ సిగ్నల్ రావడం వెనుక ఉన్నది అంతా నాగార్జున అనుకుంటున్నారు. కానీ అతని తల్లి నుండి మద్దతు వచ్చాకే ప్రేమకు ఓకే చెప్పాడట. ఇదే విషయం సమంతకు కూడా చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన తల్లి ఓకే చెప్పాక ఇక నాకు భయం లేదని అనుకున్నాడట. ఇక నాగ్ ను ఒప్పించేందుకు మాత్రం కొద్దిగా ఎత్తులు వేశాడని సమాచారం. అయితే నాగచైతన్యకు తండ్రితో కంటే తల్లితోనే అనుబంధం ఎక్కువ. చదువు పూర్తయ్యే వరకు తల్లే లోకంగా పెరిగాడు. కేవలం రామానాయుడు ఇంటికి, నాగచైతన్య ఇంటికి వచ్చి పోవడమే కానీ తనకు తల్లే అన్నీ.

అందుకే తన తల్లి లక్ష్మీ ఒప్పుకున్నాక అదే విషయం నాగార్జునకు చెప్పి ఒప్పించాడట. తన పెళ్లి కానీ వ్యక్తిగత విషయం ఏదైనా కానీ ఆమెకు చెప్పి కానీ చేయడట. కేవలం కెరీర్ విషయం మాత్రం నాగార్జున చూసుకుంటాడు. తనకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మే లోకంగా బతికిన నాగచైతన్య.. పెళ్లిలోనే ఆమెకే బాధ్యత అప్పజెప్పాడట. 1990 నుండి నాగార్జునతో కానీ, అతని ఫ్యామిలీతో కానీ ఎలాంటి రిలేషన్ మెయింటెయిన్ చేయలేదు. కానీ తన కొడుకు వెళ్తానంటే మాత్రం వద్దనలేదు. అయినా నాగచైతన్యకు అమ్మే అన్నీ అని అతని ఫ్రెండ్స్ కూడా అంటారు.

English summary

Naga Chaitanya gives more importance to his mother than father