డిసెంబర్‌లో 'సాహసం శ్వాసగా సాగిపో'

Naga Chaitanya - Gowtham Menon Movie in December 3rd Week

03:52 PM ON 19th November, 2015 By Mirchi Vilas

Naga Chaitanya - Gowtham Menon Movie in December 3rd Week

నాగచైతన్య, గౌతమ్‌ వాసుదేవ్‌మీనన్‌ కాంబినేషన్‌ సూపర్‌హిట్‌. వీళ్ళ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఏమాయ చేశావె' చిత్రం చైతన్య కెరీర్‌లో ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంతోనే సమంత కూడా పరిచయం అయ్యింది. మళ్ళీ వీళ్ళ ఇద్దరి కాంబినేషన్‌లో తాజాగా ఒక చిత్రం రూపొందుతుంది అదే 'సాహసం శ్వాసగా సాగిపో' తమిళ వెర్షన్‌లో శింబు నటిస్తుండగా, తెలుగు వెర్షన్‌లో నాగచరైతన్య నటిస్తున్నాడు. ఇందులో మంజిమ మోహన్‌ హీరోయిన్‌.

సినిమా ఫస్టాఫ్‌ పూర్తి ప్రేమకథగా, సెకండాఫ్‌ పూర్తి యాక్షన్‌గా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని గౌతమ్‌ తీస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌తో పాటు ప్రీప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తి చేసుకుంది. డిసెంబర్‌ మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ ఎ.ఆర్‌. రెహమాన్‌ అందిస్తుండడం విశేషం.

English summary

Naga Chaitanya - Gowtham Menon Movie in December 3rd Week