జర్నలిస్ట్ రోల్ లో చైతూ ..

Naga Chaitanya in Tamil Remake Metro Movie

11:43 AM ON 7th July, 2016 By Mirchi Vilas

Naga Chaitanya in Tamil Remake Metro Movie

అసలే ఈమధ్య సమంతతో లవ్ ట్రాక్ లో పడి, అందరి దృష్టిని ఆకర్షించిన నాగ చైతన్య టాలీవుడ్ లో మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలాగైనా హిట్ కొట్టాలన్న ట్రైల్స్ లో ఉన్న చైతూ, ఇందుకోసం ఇతర భాషల్లో సక్సెస్ అయిన మూవీలను తెగ చూసేస్తున్నాడట. ఈ నేపథ్యంలో రీసెంట్ గా రిలీజ్ అయిన తమిళ ఫిల్మ్ మెట్రో అందరి ప్రసంశలు అందుకోవడంతో చైతూ అటువైపు ఓ కన్నేశాడు.

ఇక స్టోరీ విషయానికొస్తే.. కన్న తల్లి చావుకు కారణమైన చైన్ స్నాచర్ ను పట్టుకునే జర్నలిస్ట్ రోల్ లో చైతూ కనిపిస్తాడట. ఈ క్రమంలో అతను తెలుసుకున్న నిజాలేమిటి? చైన్ స్నాచర్ల అసలు లక్ష్యం ఏమిటి? హీరో ఎలా పగ తీర్చుకున్నాడనే సబ్జె్క్ట్ తో తెరకెక్కిన చిత్రం మెట్రో. కోలీవుడ్ లో సంచలన విజయం సాధించడంతో దీన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడట. క్రిమినల్ మైండ్స్ ను ఎక్స్ పోజ్ చేస్తూ క్రైం థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో నాగచైతన్య లీడ్ రోల్ చేయబోతున్నాడనీ, ఇప్పటికే ఆ ఫిల్మ్ రైట్స్ కొనుగోలు చేసినట్టు టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా ఎప్పడు మొదలవుతుందో చూడాలి.

ఇది కూడా చూడండి: వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే

ఇది కూడా చూడండి: మన క్రికెటర్ల చదువు ఎంతో తెలుసా.?

ఇది కూడా చూడండి: సన్నీలియోన్ గురించి మీకు తెలియని

English summary

Naga Chaitanya doing another Tamil remake film Metro. The film was recent blockbuster of Kollywood.