అఖిల్‌ కంటే చైతూనే బెటర్‌

Naga Chaitanya is better than Akhil

04:24 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Naga Chaitanya is better than Akhil

అక్కినేని నాగార్జున నట వారసుడిగా అక్కినేని అఖిల్‌ అదిరిపోయే ఎంట్రీ ఇస్తాడనుకున్న అక్కినేని అభిమానులకి అఖిల్‌ తన మొదటి చిత్రంతోనే అట్టర్‌ ఫ్లాప్‌నిచ్చి అభిమానుల్ని నిరాశ పరిచాడు. మొదటి చిత్రమే అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడం ఒక నిరాశ అయితే ఇప్పటివరకు అఖిల్‌ మరో సినిమాకి సైన్‌ చెయ్యకపోవడం మరో నిరాశయింది. దీనితో ఫిలింనగర్‌లో అఖిల్‌ పై సెటైర్లు వెయ్యడం మొదలు పెట్టేశారు. అఖిల్‌ కంటే నాగ చైతన్య నే బెటర్‌ అని అంటున్నారు.

అంతేకాదు హిట్లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక అది విడుదల కాకముందే మరో సినిమాని లైన్లో పెట్టేస్తున్నాడు. దీనితో చైతూ చేసుకున్న ప్లానింగ్‌ ఏంటో అందరికీ తెలిసొచ్చింది. ఇప్పుడొచ్చే సాహసమే శ్వాసగా సాగిపో, ప్రేమమ్‌ చిత్రాల్లో కచ్చితంగా ఒక చిత్రం బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చేస్తాడని అభిమానుల్లో ధీమా పెరిగిపోయింది. అయితే అఖిల్‌కి హీరో కాకముందే బోలెడంత క్రేజ్‌ వచ్చింది కానీ దాన్ని అఖిల్‌ వినియోగించుకోలేకపోయాడు. మొదట చిత్రం ఎంపికలోనే తప్పటడుగు వేశాడు. అభిమానులు అఖిల్‌ క్రేజ్‌ మరువక ముందే అఖిల్‌ ఇప్పటికైనా మేల్కొంటే బెటర్‌ అని సినీ ప్రముఖులు చెప్తున్నారు.

English summary

Akkineni Naga Chaitanya is better than Akkineni Akhil.