రాజమండ్రిలో 'మజ్ను' షూటింగ్‌!

Naga Chaitanya Majnu movie shooting in rajahmundry

01:23 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Naga Chaitanya Majnu movie shooting in rajahmundry

అక్కినేని నాగచైతన్య తాజాగా నటిస్తున్న చిత్రం 'మజ్ను'. తమిళంలో సూపర్ హిట్ అయిన 'ప్రేమమ్' చిత్రానికి ఇది రీమేక్. 'కార్తికేయ' ఫేమ్‌ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య మూడు ఏజ్‌ గ్రూపులలో కనిపించనున్నాడు. అందుకే ఒక్కొక్క ఏజ్‌కి ఒక్కొక్క హీరోయిన్‌ ని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్‌, అనుపమ పరమేశ్వరన్‌ లను ఇప్పటీకే ఎంపిక చేసుకోగా ఇంకో హీరోయిన్గా రెజీనాని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. డిసెంబర్‌ 1న వైజాగ్‌లో మొదలైన ఈ చిత్రం షూటింగ్‌ నిన్నటితో పూర్తయింది. ఈ షెడ్యూల్లో చైతూ, శృతిహాసన్‌ లపై వచ్చే సన్నివేశాల్ని చిత్రీకరించడంతో పాటు ఒక పాటని కూడా చిత్రీకరించారు.

తరువాత షెడ్యూల్‌ని రాజమండ్రిలో ఈ చిత్రాన్ని చిత్రీకరించడం కోసం ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాలని పరిశీలిస్తున్నారు. డిసెంబర్‌ చివరి వారం నుండి రాజమండ్రిలో షూటింగ్‌ ప్రారంభిస్తారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకం పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary

Naga Chaitanya Majnu movie shooting in rajahmundry. This movie is directing by Chandu Mondeti. Shruti Haasan and Anupama Parameswaran are acting as lead heroines in this film.