ఎవరికీ చెప్పకుండా ఆ హీరోయిన్ ని పెళ్లి చేసేసుకున్న చైతూ

Naga Chaitanya married Shruti Hassan

02:59 PM ON 30th April, 2016 By Mirchi Vilas

Naga Chaitanya married Shruti Hassan

ఇలాంటి వార్తలు బోలెడన్ని చూశాం.. గ‌తంలో అనుష్క‌తో నాగ చైతన్యకు పెళ్ల‌యిపోయింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అయితే అవ‌న్నీ పుకార్లే. ఈసారి మాత్రం చైతూ పెళ్లి నిజంగానే అయిపోయింది. కావాలంటే ఈ విష‌యాన్ని దర్శకుడు చందు మొండేటిని అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఈ పెళ్లి పెద్ద ఆయనే మరి. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’. మ‌ళ‌యాళంలో హిట్ అయిన ప్రేమ‌మ్ సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో తాజాగా చైతు-శృతి పెళ్లి సీన్ల‌ను చిత్రీక‌రించారు. శృతిహాసన్ సహా ఇతర కీలక నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు.

సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీడీవీ ప్రసాద్ సమర్పకుడు. అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్, బ్రహ్మాజీ, ప్రవీన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాని జూలై 16న విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంతకుముందే జూన్‌లో ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించనున్నాడు చైతూ.

English summary

Naga Chaitanya married Shruti Hassan