సమంతాని చైతూ మదర్ కలిసి ఓకే చేసింది.. అయిన నాగ్ ఎందుకు ఒప్పుకోనట్టు?

Naga Chaitanya mother meets Samantha

12:18 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Naga Chaitanya mother meets Samantha

అతి రహస్యం బట్టబయలు అన్నచందంగా సమంతా-నాగ చైతన్య ఇద్దరి లవ్ తయ్యారయింది. అసలు ఈ వ్యవహారం ఇప్పుడొక ఓపెన్ సీక్రెట్ లా తయారయ్యింది. ఔనూ అనే అనిపిస్తున్నా ఈ ప్రేమ కథలో ఇంకా ఏదో ట్విస్ట్ కనిపిస్తోంది మళ్ళీ అంతలోనే కన్ఫార్మ్ అనిపిస్తోంది. అవును.. కాదూ అంటూ ఊహాగానాల్లో బతికిన వాళ్ళకి రీసెంట్ గా గోవాలో చైతన్య-సమంతలు కలిసి సమంత రిలీజ్ సినిమా చూడటంతో విషయం కన్ఫార్మ్ అయిపోయింది. ఇది నిజమే అంటూ ఫిక్సైపోయారు. అయితే ఇంకా... ఎక్కడో ఓ చిన్న డౌట్ ఉన్నా తాజా అప్ డేట్ ప్రకారం ఆ డౌట్ కూడా క్లియర్ అయినట్టే.

సమంతతో పెళ్ళికి నాగార్జున అభ్యంతరం ఉందీ అని వార్తలు వచ్చాయి అందుకే సమంతా ప్రేమలో మునిగి తేలుతున్న చైతన్య ఈ పెళ్లికి అమ్మ లక్ష్మీ దగ్గుబాటిని సపోర్ట్ గా తీసుకోవాలని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే అమ్మ దగ్గరికి వెళ్లి సమంతతో ఓ రోజు మొత్తం చెన్నైలో గడపమని బొమ్మరిల్లు ప్రపోజల్ పెట్టాడట. ఇక చెన్నై వెళ్ళిన నాగ చైతన్య మదర్ సమంత గుణగణాల గురించి తెలుసుకుని వారి పెళ్లికి తనకే అభ్యంతరమూ సర్టిఫై చేసేసినట్లు చెబుతున్నారు. అయినా ఇదంతా రూమరే అన్నట్టు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారోనని అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.

సినిమా అమ్మాయి వద్దా? లేక సమంతానే వద్దా? ఎందుకని నాగార్జునకి ఈ పెళ్ళి నచ్చటం లేదు? సినిమా ఇండస్ట్రీలోని ఆడవాళ్ళ మీద నాగ్ కి చిన్న చూపు ఉందా అంటే ఆ ప్రశ్నే లేదు. మరి ఎక్కడ తేడా వచ్చిందబ్బా !

English summary

Naga Chaitanya mother meets Samantha