చైతూ కొన్న కొత్త బైక్ ఖరీదు తెలిస్తే షాకౌతారు!

Naga Chaitanya new bike cost

05:39 PM ON 11th July, 2016 By Mirchi Vilas

Naga Chaitanya new bike cost

అక్కినేని నాగ చైతన్య సినిమాల తరువాత ఎక్కువగా ఇష్టపడేది బైక్స్ మరియు బైక్ రైడింగ్ అని చైతూ సన్నిహితులు చెబుతుంటారు. మార్కెట్లోకి వచ్చే కొత్త మోడల్ బైక్స్ అప్ డేట్స్ ను ఆయన ఎప్పటికప్పుడు తెలుసుకుంతారట. ఆ తరువాత చైతూకి నచ్చిన మోడల్ బైక్ ను తానే స్వయంగా కొనుగోలు చేసుకుని సొంతం చేసుకుంటాడట. అలాగే తాజాగా ట్రియూమ్ప్ అనే కంపెనీ నుండి కొత్తగా మార్కెట్లోకి వచ్చిన థ్రక్స్ టన్ ఆర్ అనే మోడల్ బైక్ చైతూని బాగా ఆకట్టుకుంది. దాంతో ఆయన హైదరాబాద్ లోని షోరూమ్ కి వెళ్లి ఈ బైక్ ను కొనుగోలు చేశాడు. కొన్న వెంటనే చైతూ ఈ బైక్ పై సరదాగా రైడ్ చేశాడని చెబుతున్నారు.

చైతూ ఓ కష్టమర్ గా తమ షోరూమ్ కి రావడం పట్ల, నిర్వాహకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర ప్రకారం ఈ బైక్ ఖరీదు అక్షరాలా 11 లక్షలని తెలుస్తోంది. వేల కోట్లు ఆస్తి ఉన్న చైతూకి ఇది పెద్ద ఖరీదేమీ కాకపోవచ్చు కానీ ఒక భారతీయుడు సగటు వ్యక్తి సంపాదనతో పోలిస్తే ఇది చాలా మొత్తం అని చెప్పవచ్చు.

English summary

Naga Chaitanya new bike cost