శృతి హాసన్ కోసం 50 లక్షలు పోగొట్టుకున్న చైతూ!

Naga Chaitanya reduced his remuneration for Shruthi Hassan

01:21 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Naga Chaitanya reduced his remuneration for Shruthi Hassan

నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం ప్రేమమ్. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ చిత్రానికి ఇది రీమేక్. కార్తికేయ ఫేం చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చైతూ సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ సమయంలో చైతూ ఈ పాత్రకైతే శృతి హాసన్ అయితే సరిగ్గా సరిపోతుందని శృతి హాసన్ ని రికమండ్ చేసాడట. అయితే ఈ చిత్ర ప్రొడ్యూసర్ మాత్రం రేసుగుర్రం, శ్రీమంతుడు వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఆమె డిమాండ్ పెరిగిపోయింది.

ఇప్పుడు ఈ చిత్రంలో ఆమెను తీసుకుంటే ఎక్కువ పారితోషికం అడుగుతుంది అని చెప్పాడట. దీంతో చైతూ తన పారితోషికంలో 50 లక్షలు తగ్గించుకుని అది శృతి హాసన్ కి ఇమ్మని చెప్పాడట. దీంతో నిర్మాత వెంటనే ఓకే చెప్పి శృతి హాసన్ ని కలిసి అడ్వాన్సు ఇచ్చేసాడట. మొత్తానికి చైతూ శృతి హాసన్ కోసం 50 లక్షలు వదిలేసుకున్నాడన్న మాట. ఈ చిత్రం ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

English summary

Naga Chaitanya reduced his remuneration for Shruthi Hassan