తన తల్లి గురించి సీక్రెట్స్ బయటపెట్టిన చైతూ..

Naga Chaitanya shocking comments about his mother

04:20 PM ON 9th May, 2016 By Mirchi Vilas

Naga Chaitanya shocking comments about his mother

నాగార్జునకి మొదట్లో స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి. రామానాయుడు కూతురు లక్ష్మీతో వివాహం కావడం, వారి అనురాగానికి గుర్తుగా నాగచైతన్య పుట్టడం, ఆ తర్వాత లక్ష్మీతో దూరంగా ఉంటున్న నాగ్, అమలను పెళ్లి చేసుకోవడం, వారిద్దరికీ అఖిల్ పుట్టడం, టీనేజ్ వచ్చే వరకు నాగ చైతన్య తల్లి దగ్గర పెరగడం, ఆ తర్వాత నాగ్ దగ్గరకు చేరడం తెల్సిందే. ఓ పక్క నాగ చైతన్య, మరోపక్క అఖిల్ లను హీరోలుగా నాగ్ మలిచాడు. ఇక నాగ చైతన్య 'మదర్స్ డే' సందర్భంగా తన కన్నతల్లి గురించి కొన్ని కామెంట్లు చేసాడు. టీనేజ్ వరకూ తల్లి దగ్గర ఉండడం వలన తల్లితో అనుబంధం పెనవేసుకున్న నాగ చైతన్య చెప్పిన విషయాల్లో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: చిరంజీవికి నచ్చని ‘గ్యాంగ్‌లీడర్‌’- వాస్తవాలు ఇవిగో

వీటిని మీడియాతో షేర్ చేసుకున్నాడు. '18 సంవత్సరాల వరకూ నేను అమ్మ తప్ప వేరే లోకం లేదు నాకు. మేమిద్దరమే ఈ ప్రపంచం అన్నట్టుగా ఉండేది. అమ్మతోనే ఆటా పాటా... క్రికెట్, మ్యూజిక్, రేసింగ్, ఫోటోగ్రఫీ... ఇలా ఏది ఇష్టమంటే అది అమ్మ నేర్పించింది. ఏదైనా కావాలని అడిగితే ముందు పరీక్ష పాసవ్వు, తప్పకుండా తెచ్చిపెడతా అనేది. ఊరికే వస్తే దానివలన సంతోషం ఉండదనేది అమ్మ ఉద్దేశ్యం. సినీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మకు ఆ రంగంలోని ఎత్తుపల్లాలు, అప్ అండ్ డౌన్స్ పూర్తిగా తెల్సు. అందుకే డిగ్రీ పూర్తయ్యే దాకా సినిమాల జోలికి వద్దని చెప్పేది. అమ్మ నిజంగా ఓ ఫ్రెండ్ లా, గైడ్ గా, మాస్టర్ గా... ఉంటూ, నన్ను మంచి వ్యక్తిత్వంతో తీర్చిదిద్దింది' అని ఎంతో ఉద్వేగంగా చెప్పాడు.

ఇది కూడా చదవండి: భార్య అక్ర‌మ సంబంధాన్ని టెక్నాల‌జీతో బయట పెట్టాడు

సినీరంగ ప్రవేశంతో యంగ్ హీరోల్లో ఒకడిగా రాణిస్తూ, నాగ్ నట వారసునిగా ఉన్న నాగచైతన్య ఇందుకు ప్రోత్సాహం ఇచ్చిన తల్లిని మరువనని అంటున్నాడు.

ఇది కూడా చదవండి: అరిటాకులో భోజనం చేస్తే ఏం జరుగుతుంది..

English summary

Naga Chaitanya shocking comments about his mother. Young hero Naga Chaitanya shocking comments about his mother Lakshmi.