టాప్‌ హీరోయిన్‌తో చైతూ పెళ్ళి????

Naga Chaitanya To Marry Top Heroine

03:51 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Naga Chaitanya To Marry Top Heroine

యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య 'ఏమాయ చేశావే' చిత్రంతో అమ్మాయిల కలల రాకుమారుడిలా మారిపోయాడు. ఈ చిత్రం తరువాత ఈ లవర్‌ బాయ్‌కి అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నాడు. చైతూని చూస్తే ఏ అమ్మాయైనా పెళ్ళికి ఓకే అనాల్సిందే. కానీ చైతూ మాత్రం డీసెంట్‌గా ఉంటాడు. నాగచైతన్య అరేంజ్డ్‌ మ్యారేజ్‌ చేసుకుంటాడని ఎంతో మంది అనుకున్నారు. చైతూ పెళ్ళి స్వయంగా కింగ్‌ నాగార్జునే కుదిర్చారని వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లే అని తేలిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మరో వార్తలు హల్‌చల్‌ చేస్తుంది. చైతూ ఒక టాప్‌ హీరోయిన్‌ని ప్రేమిస్తున్నాడని వార్త చక్కెర్లు కొడుతుంది. అయితే ఆ హీరోయిన్‌ ఎవరన్నది ఇంకా బయటకి రాలేదు. కానీ చైతూ ఎవరిని ప్రేమిస్తున్నాడన్నది ఫిలిం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఆ హీరోయిన్‌ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ టాప్‌ హీరోయిన్‌గా చెలరేగిపోతుందని సమాచారం. చైతూ, ఆ హీరోయిన్‌ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిపోతున్నారట. వీరిద్దరూ షూటింగ్‌ లేనప్పుడు బయటకెళ్లి జాలీగా ఎంజాయ్‌ చేస్తున్నారని సమాచారం. అయితే విషయం ఇంకా బయటకి రాలేదు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

Michi Vilas Poll

నాగ చైతన్య పెళ్లి చేస్కోబోయే హీరోయిన్ ఎవరై ఉండవచ్చు

English summary

Young Hero Naga Chaitanya was presently busy with Premam Remake. Recently a news came to know from film nagar that Naga Chaitanya was in deep love with one of the top heroine in Telugu film industry and he is going to marry that heroine soon.