'నారారోహిత్'కి తమ్ముడిగా 'నాగశౌర్య'!!

naga shourya acting as a younger brother with nara rohit in jyo achyutananda

07:05 PM ON 21st November, 2015 By Mirchi Vilas

naga shourya acting as a younger brother with nara rohit  in jyo achyutananda

నారారోహిత్ 'ఊహలు గుసగుసలాడే' ఫేమ్ అవసరాల శ్రీనివాస్ 'జ్యో అచ్యుతానంద' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇది ఓ మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు అవసరాల శ్రీనివాస్ అనౌన్స్ కూడా చేశారు. తాజాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోలకి అవకాశం ఉండడంతో రెండో హీరోగా, తన మొదటి చిత్రంలో హీరో అయిన నాగశౌర్యనే ఈ చిత్రంలో కూడా నటింపజేయాలని దర్శకుడు శ్రీనివాస్ నాగశౌర్యని ఎంపిక చేశారు. వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్న నాగశౌర్య ఈ చిత్రంలో నారారోహిత్ కు తమ్ముడిగా, ద్వితీయ కథానాయకుడిగా నటిస్తున్నాడు.

ఊహలు గుసగుసలాడే చిత్రాన్ని నిర్మించిన వారాహి చలనచిత్రమే ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇంకా త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసి ప్రకటిస్తాం అని అవసరాల శ్రీనివాస్ ఈ సందర్భంగా చెప్పారు.

English summary

naga shourya acting as a younger brother with nara rohit in jyo achyutananda