హీరో కూతుళ్లతో రొమాన్స్ కి అలవాటు పడ్డ యంగ్ హీరో!

Naga Shourya romancing with Raja Sekhar daughter Shivani

12:05 PM ON 20th September, 2016 By Mirchi Vilas

Naga Shourya romancing with Raja Sekhar daughter Shivani

సినిమా ఫీల్డ్ లో ఒక్కో సమయం ఒక్కొక్కరికి అనుకూలంగా ఉంటుంది. మరి ఈ ఏడాదిలో ఒక మనసుతో ఆకట్టుకుని, జ్యో అచ్యుతానందతో రీసెంట్ గా హిట్ కొట్టిన నాగశౌర్య ఇక ఫుల్ బిజీగా మారనున్నాడు. పెద్ద పెద్ద దర్శకులు సైతం ఈ కుర్ర హీరో కోసం పోటీ పడుతున్నారు. దీంతో తన తర్వాతి చిత్రాన్ని జాగ్రత్తగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అందుకే ఓ మాంచి థ్రిల్లర్ సబ్జెక్టుతో కూడిన ప్రాజెక్ట్ ని చేయబోతున్నాడు. కొత్త దర్శకుడు, కొత్త తరహా కథ, కథనాలతో రూపొందించే ఈ ప్రాజెక్టును వారాహి చలనచిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తారు. అయితే ఇందులో హీరోయిన్ గా తెరపైకి మరో హీరో వారసురాల్ని నటింపచేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయట.

జీవిత రాజశేఖర్ లు కూడా తన కుమార్తె శివాని అరంగేట్రానికి ఈ సినిమా అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారట. 22 ఏళ్ల శివానికి నటిచడానికి సరైన టైం అవడంతో త్వరలో పట్టాలెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా తనే ఓకే అయ్యే సూచనలున్నాయట. గతంలో కృష్ణ, మోహన్ బాబు, నాగ బాబు కుమార్తెలు కూడా ఇలా వచ్చి మంచి స్టార్లు అయిన వారే కదా..

ఇది కూడా చదవండి: ఆన్ లైన్ లో గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ ని పొందడానికి బెస్ట్ టిప్స్

ఇది కూడా చదవండి: ఫేస్ బుక్ లోపాలు గుర్తించినందుకు ఈ అబ్బాయికి ఫేస్ బుక్ ఏమిచ్చిందో తెలుసా?

ఇది కూడా చదవండి: మానవ శరీరం గురించి ఎవరికీ తెలియని అద్భుత రహస్యాలు

English summary

Naga Shourya romancing with Raja Sekhar daughter Shivani. Young hero Naga Shourya doing romance with star hero daughters. Before he done romance with Niharika now he want to do romance with Rajsekhar's daughter Shivani.