ఆడాళ్ళయితే అన్నీ ఆలోచిస్తారన్న నాగశౌర్య 

Naga Showrya About Female Directors

11:29 AM ON 22nd January, 2016 By Mirchi Vilas

Naga Showrya About Female Directors

'మగాళ్ళతో పోలిస్తే , ఆడాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. సమాజంలో పరిస్థితికి అనుగుణంగా వ్యవహరిస్తారు. అందుకే మగ దర్శకుల కన్నా మహిళా దర్శకులు అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని చిత్రాలు తీస్తారు' అని వర్ధమాన హీరో నాగశౌర్య అన్నాడు. నాగశౌర్య - మాళవిక నాయర్ హీరో హీరోయిన్లు గా 'కళ్యాణ వైభోగమే' చిత్రం రూపుదిద్దుకుంది. దీనికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించింది. ఓ టివి చానల్ కార్యక్రమంలో నందినీతో కల్సి పాల్గొన్న నాగశౌర్య 'కళ్యాణ విభోగమే' చిత్రం బాగా వచ్చిందన్నాడు. మంచి హిట్ అవుతుందని ఆకాంక్షిస్తూ , నందినీ రెడ్డితో పనిచేయడం ఆనందంగా ఉందన్నాడు. ఇప్పటివరకు 8సినిమాల్లొ నటించిన తాను తొలిసారిగా మహిళా దర్శకురాలి తో కల్సి పనిచేయడం సంతృప్తి నిచ్చిందన్నారు.

English summary

Tollywood Young Hero Naga Showrya says that female was think twice better than man. He says this thing in Jabardasth. He says that he was felt very greatful while working under the direction of director Nadini Reddy