నారారోహిత్‌కి నాగశౌర్యకి సంబంధం ఏమిటి?

Naga Sourya in Nara Rohit's film

06:15 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Naga Sourya in Nara Rohit's film

నారారోహిత్‌ లేటెస్ట్‌ మూవీ జ్యోఅచ్యుతానంద. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్న అవసరాల శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. 'జ్యోఅచ్యుతానంద' టైటిల్‌ను అవసరాల శ్రీనివాస్‌ ముందే వివరించారు. జ్యో అంటే జ్యోతి - అచ్యుతరావు- ఆనందరావు అనే ముగ్గురు వ్యక్తుల మధ్య సాగే ప్రేమకథ. ఈ చిత్రానికి నారారోహిత్‌తో పాటు ఇంకో హీరోకి ఆస్కారం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోగా వెలుగులోకి వచ్చిన నాగశౌర్య ఇప్పుడు వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నాడు. అవసరాల శ్రీనివాస్‌ తన మొదటి సినిమాలో హీరో అయినటువంటి నాగశౌర్యనే ఈ సినిమాకి రెండో హీరోగా ఎంపిక చేసుకున్నాడు. ఈగ, అందాల రాక్షసి, లెజెండ్‌, ఊహలు గుసగుసలాడే లాంటి సినిమాలతో ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ని సంపాదించుకున్న సాయి కొర్రపాటి 'వారాహి చలనచిత్రం' పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ్యోఅచ్యుతానందకి హీరోలు ఎంపిక అయిపోయింది ఇంకా జ్యోతి ఎంపిక జరగాల్సి ఉంది, అదేనండి హీరోయిన్‌ ఎంపిక జరగాల్సి ఉంది. ఈ చిత్రానికి కళ్యాణిమాలిక్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

English summary

Naga Sourya in Nara Rohit's film