ఒక మనసులో నిహారిక డ్రెస్ డిజైన్ చేసింది ఎవరో తెలిస్తే షాకౌతారు!

Nagababu wife designed Niharika costumes for Oka Manasu movie

10:31 AM ON 25th June, 2016 By Mirchi Vilas

Nagababu wife designed Niharika costumes for Oka Manasu movie

అవుననే అంటున్నారు అందరూ, అసలు విషయం ఏమిటంటే, ఈ సీజన్ లో మెగా ఫ్యాన్స్ కి మోస్ట్ అవైటెడ్ మూవీ ఒక మనసు. మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా అరంగేట్రం చేయడం తెల్సిందే. దీంతో అందరి దృష్టి అటే పడింది. మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు ఎంట్రీ ఇచ్చినా, తొలి హీరోయిన్ నాగబాబు డాటర్ నిహారిక కావడంతో అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక ఒక మనసు మూవీ చూసిన వాళ్లందరికీ ఓ విషయంలో మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోయింది. కాటన్ చీరలు, చుడీదార్లతో ఒక అమ్మాయిని ఇంత అందంగా చూపించచ్చా అనిపించేసింది.

ఈ మూవీలో ప్రధానమైన హైలైట్.. నిహారిక లుక్ అని ఒప్పుకోవాల్సిందేనని ఘంటాపధంగా చెబుతున్నారు. ప్రతీ ఫ్రేమ్ లోనూ ఎంతో అందంగా కనిపించింది మెగా డాటర్. ఎక్కడా ఆర్భాటం అనేది లేకుండా, శారీస్ చుడీదార్లు పంజాబీ డ్రెస్ లు.. అంతా నార్మల్ వేర్. అందుకు తగ్గట్లుగా మ్యాచింగ్ ఆర్నమెంట్స్. అందులో కూడా బంగారం ధగధగలు పెద్దగా కనిపించవు. ఫ్యాషనబుల్ ఫ్యాన్సీ వేర్ ని ఇంత అందంగా చూపించచ్చని నీహారిక నిరూపించింది. నిజానికి ఈ క్రెడిట్ అంతా నాగబాబు వైఫ్ పద్మజకే దక్కుతుంది. 30-40 సన్నివేశాలకు గాను 60-70 డ్రెస్ లు డిజైనింగ్ వాడారు.

ఇవన్నీ పద్మజ సొంత డిజైన్సేనట. కూతురును సినిమా రంగానికి పరిచయం చేస్తూ ఆమె తీసుకున్న జాగ్రత్తలు అమోఘం అంటూ పలువురు కితాబు నిస్తూ, ఈ విషయంలో మాత్రం నాగబాబు వైఫ్ కి హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు. నీహారిక తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా చేసింది నాగబాబు భార్యే. ఆమె స్టైలింగ్ కాస్ట్యూమ్స్ తోనే సినిమాకి సగం కలర్ వచ్చేసిందని తెగ మెచ్చేసుకుంటున్నారు. మొత్తానికి మాంచి ఎంట్రీ ఇప్పించారని అభిమానులు ఆనందంతో ఉన్నారట.

English summary

Nagababu wife designed Niharika costumes for Oka Manasu movie