బాహుబలి, అరుంధతిలను మించిపోయిన టీజర్(వీడియో)

Nagarahavu movie teaser

12:23 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Nagarahavu movie teaser

ఒకప్పుడు తెలుగులో ఎక్కువ గ్రాఫిక్స్ తో తీసే దర్శకుడు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు కోడి రామకృష్ణ. ఆయన తెరకెక్కించిన అమ్మోరు, దేవి, దేవుళ్ళు, త్రినేత్రం, అంజి, అరుంధతి వంటి చిత్రాలు భారీ గ్రాఫిక్స్ తో తీసిన చిత్రాలే కాకుండా ఇవన్నీ ఘన విజయాలు సాధించాయి. అరుంధతి చిత్రం తరువాత కోడి రామకృష్ణ మరోసారి భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కించిన అవతారం చిత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలించింది. అయితే తాజాగా కోడి రామకృష్ణ మరో భారీ గ్రాఫిక్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కన్నడ సాహస సింహ విష్ణువర్ధన్ 2009లో చనిపోయారు. అయితే ఆయన్ను గ్రాఫిక్స్ లో తీర్చిదిద్ది ఆయన్ను హీరోగా చేసి తెరకెక్కించిన చిత్రం 'నాగరహవు'.

ఇది స్వర్గీయ విష్ణువర్ధన్ గారికి 201వ చిత్రం. ఇందులో శాండల్ వుడ్ క్వీన్ రమ్య మరియు దిగంత్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. పూర్తి గ్రాఫిక్స్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మకుట గ్రాఫిక్స్ సంస్థ గ్రాఫిక్స్ అందిస్తుంది. మకుట ఇది వరకు ఈగ, బాహుబలి చిత్రాలకు గ్రాఫిక్స్ అందించింది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్స్ చేస్తుంది. ఒకసారి ఆ టీజర్ ని మీరు కూడా చూడండి.

English summary

Nagarahavu movie teaser