లేచిపోవడం గురించి నాగ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్

Nagarjuna About Dialogue In Geethanjali Movie

10:07 AM ON 24th March, 2016 By Mirchi Vilas

Nagarjuna About Dialogue In Geethanjali Movie

విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల అభిమానం చూరగొంటున్న నాగార్జున ఇప్పుడు మల్టీ స్టారర్ వైపు కూడా దృష్టి పెట్టాడు. ఊపిరి రిలీజ్ నేపధ్యంలో నాగ్ ఓ ఫ్లాష్ బ్యాక్ గురించి వివరించాడు. ‘‘ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని సినిమాలు చేయడం నాకు మొదట్నుంచీ అలవాటు లేదు. నటుడిగా ప్రయాణం ఆరంభించిన తొలి రోజుల్లోనే ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనే ఆలోచన ఉండేది. కానీ తెలుగు సినిమా అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే మేకప్‌ చేసుకోవాలి, తెరపై ఇలాగే కనిపించాలని చెప్పేవాళ్లు. తప్పని పరిస్థితుల్లో నేను కూడా అలాగే చేసేవాణ్ని. కానీ ఏవీ ఫలితం ఇవ్వలేదు. నా నుంచి ప్రేక్షకులు ఏదో కొత్తదనం కోరుకొంటున్నట్టు అనిపించింది. అందుకే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టా. ‘గీతాంజలి’ అలా నా సొంత నిర్ణయం మేరకు చేసిందే.

నిజానికి అప్పట్లో కళాశాల విద్యార్థుల కోసం సినిమాలు చేసేవాళ్లు ఎవ్వరూ లేరు. ఏ హీరోలమీద ప్రేమకథలు తీసే పరిస్థితి అప్పట్లో లేనప్పుడు నేను ‘గీతాంజలి’ చేశా. అందులో ‘లేచిపోదాం...’ అనే డైలాగుని విని ‘తెలుగు భాషని నాశనం చేశార’ని సమీక్షల్లో కొద్దిమంది సినీ విమర్శకులు రాశారు. అదే ‘సోగ్గాడే చిన్నినాయనా’ విషయానికొచ్చేసరికి ‘భలే మంచి భాషని వాడారు, అచ్చమైన తెలుగు మాటలు వినిపించాయి’ అన్నారు. నిజానికి ‘సోగ్గాడే...’లోని చాలావరకు మాటలు గీత దాటిపోయేలా ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో అలాంటి మాటల్ని వాడటం అరుదు. అందుకే ఆ భాష కొత్తగా అనిపించింది’’అంటూ ఫ్లాష్ బ్యాక్ ని జోడించి వర్తమానం వరకూ వచ్చిన మార్పుని వివరించాడు.

English summary

Tollywood Ever Green Handsome Hero Akkineni Nagarjuna Said some interesting news about his Geethanjali Movie.He syas that on those no one was ready to do movies for College Students and then he did that movie on his own decision.He says that in Geethanjali movie a dialogue called "Lechipodhama" was opposed by many of the Movie Critics. Now the days has been changed and he said that he used some dialogues in his recent hit Soggade Chinni Nayana Movie.