నాగ్‌ తో భక్తిరస చిత్రం

Nagarjuna acting in another devotional movie

01:07 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Nagarjuna acting in another devotional movie

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో భారీ హిట్‌ సినిమాలు వచ్చాయి. కమర్షియల్‌ చిత్రాలతో పాటు భక్తిరస చిత్రాలు కూడా ఈ కాంబినేషన్‌లో వచ్చాయి. అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి లాంటి భక్తిరస చిత్రాలు తెలుగులో సంచలన విజయాలు సాధించాయి. అంతేకాకుండా వీరి కాంబినేషన్‌కి తెలుగులో ఒక ప్రత్యేకమైన స్ధానాన్ని తెచ్చి పెట్టాయి. తాజా వార్తల ప్రకారం వీరిద్దరి కాంబినేషన్‌ లో మరో భక్తిరస చిత్రం రానుందని సమాచారం. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు స్వయంగా స్పష్టం చేశారు. ఈ సినిమా 'నమో వేంకటేశాయ' అనే పేరుతో రూపొందనుంది. ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్‌ లో 10వ సినిమా కావడం మరో విశేషం. ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్ పైకి రానుందని డైరెక్టర్‌ రాఘవేంద్రరావు తెలిపారు.

English summary

Nagarjuna acting in another devotional movie. This movie name is Namo Venkateshaya and movie is directing by Raghavendra Rao.