హ‌తిరామ్ బాబాగా నాగ్

Nagarjuna acts as Hathi ram baba

05:26 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Nagarjuna acts as Hathi ram baba

నాగార్జున లవర్‌ బాయ్‌గా ఎన్నో చిత్రాలలో నటించాడు. అలా అని ఆ పాత్రలకే అంకితమైపోలేదు. భక్తిరస చిత్రాలలో కూడా తన నటన చవిచూపించాడు. అన్నమయ్య, శిరిడిసాయి, శ్రీరామదాసు ఇలా విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మన్ననలను పొందాడు. ఈ తరహా సినిమాలను తెరకెక్కించాలంటే రాఘవేంద్రరావు ముందుటారు. రాఘవేంద్రరావు, నాగార్జున వీరిరువురి కాంబినేషన్లో ఇది వరకే అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి సినిమాలు వచ్చాయి. ఈ తరహాలోనే మరో భక్తి చిత్రానికి రెడీ అయిపోతున్నారు నాగార్జున, రాఘవేంద్రరావు. ఈ సారి నాగార్జున ఏ క్యారెక్టర్‌ చేయబోతున్నారో అనే కదా మీ ఆలోచన ? ఈ సారి వెంకటేశ్వరస్వామి భక్తుడైన హతిరామ్‌ బాబా క్యారెక్టర్‌ నాగ్‌ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి 'ఓం నమో వెంకటేశాయ' అని టైటిల్‌ ఫిక్స్‌ చేసారట. ఈ వేసవిలో సెట్స్‌పైకి రాబోతుంది. ఈ సినిమా నిర్మాత మహేష్‌రెడ్డి. ఇతడు ఇదివరకు శిరిడిసాయి చిత్రాన్ని నిర్మించాడు.

మరిన్ని వివరాల కోసం స్లయిడ్ షో లో చూడండి...

1/9 Pages

నాగ్, రాఘవేంద్రరావు కాంబినేషన్ 

వీరి కాంబినేషన్లో ఇంతకుముందు అన్నమ‌య్య, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి చిత్రాలు తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించాయి. ఈ తరహాలోనే మరో భక్తి ప్రాజెక్ట్ కు సిద్దమయ్యారు నాగ్, రాఘవేంద్రరావు.

English summary

Nagarjuna acts as Hathi ram baba. Once again King Nag is attempting to act in a devotional role under the direction of K. Raghavendra Rao. Sources say that Nagarjuna is going to act as Baba once again in his upcoming movie.