నాగ్, అల్లు అరవింద్ అలాంటి కార్లే ఎందుకు కొన్నట్టు?

Nagarjuna and Allu Aravind bought cars

03:43 PM ON 11th August, 2016 By Mirchi Vilas

Nagarjuna and Allu Aravind bought cars

ఇటీవలే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రేంజ్ రోవర్ కార్ ని కొని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడకి ప్రభాస్ వచ్చి కార్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ కార్యాలయానికి స్టార్ హీరో కింగ్ నాగార్జున, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విచ్చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాగార్జున, అల్లు అరవింద్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. వీరు కార్ కొంటే బెంజో, లేక ఆడీవో లేదా రేంజ్ రోవరో అయి ఉంటుంది. అయితే వీరు కొన్న కార్లు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే! ఇంతకీ ఏ కార్లు కొన్నారనేగా మీ డౌట్! ఆ విషయానికి వస్తున్నాం..

కార్లు విషయానికి వస్తే.. నాగార్జున కొన్నది ఇన్నోవా, అల్లు అరవింద్ కొన్నది మారుతి షిఫ్ట్ డిజైర్. తన ఇన్నోవా కొత్త కారుకి నాగార్జున టీఎస్ 09 ఈఎన్ 9669 నెంబర్ ని రిజిస్టర్ చేసుకోగా, అల్లు అరవింద్ తన మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారుకి టీఎస్ 09 ఈఎన్ 9580 నెంబర్ ని రిజిస్టర్ చేయించారు. అయితే ఇంత స్టార్లు అలాంటి చిన్న కార్లు కొనడమేంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary

Nagarjuna and Allu Aravind bought cars