రజనీ-నాగ్‌లతో మల్టీస్టారర్‌

Nagarjuna and Rajinikanth to act in Multi Starrer

04:28 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Nagarjuna and Rajinikanth to act in Multi Starrer

తెలుగులో మళ్ళీ మల్టీస్టారర్‌ ట్రెండ్‌ ని ప్రారంభించిన మహేష్‌-వెంకటేష్‌ 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో ఘన విజయం సాధించాడు. ఆ తరువాత పవన్‌కళ్యాణ్‌ -వెంకటేష్‌ కూడా 'గోపాల-గోపాల' చిత్రంతో మరో మల్టీస్టారర్‌ లో నటించారు. ఇప్పుడు తాజాగా మరో మల్లీస్టారర్‌ శ్రీకారం చుట్టబోతుంది. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌-అక్కినేని నాగార్జున ఒక చిత్రంలో నటించబోతున్నారు. కన్నడలో పి.వాసు తెరకెక్కించిన 'శివలింగ' చిత్రాన్ని తెలుగు, తమిళంలో రీమేక్‌ చెయ్యాలనుకుంటున్నారు. 'శివలింగ' కన్నడలో శివరాజ్‌కుమార్‌ నటించారు. అది సూపర్‌హిట్‌ కావడంతో తెలుగు, తమిళంలో రీమేక్‌ చెయ్యాలని పి.వాసు ప్లాన్‌ అట. ఇది వరకు పి.వాసు రజనీకాంత్‌ తో తెరకెక్కించిన 'చంద్రముఖి' చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరోసారి అటువంటి బ్లాక్‌ బస్టర్‌ కి వాసు శ్రీకారం చుడుతున్నాడు. అయితే ఇంకా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

English summary

Super Star Rajini Kanth and King Nagarjuna together to act in Multi Starrer Movie.These together was going to act ina Kannada Remake"Siva Linga" movie .This film was going to be directed by P.Vasu in both telugu and Tamil languages.