పాపం నాగ్ కి ఇద్దరూ హ్యాండిచ్చారా?

Nagarjuna both sons fall in love

11:52 AM ON 29th June, 2016 By Mirchi Vilas

Nagarjuna both sons fall in love

"బిడ్డల్ని కంటాం గానీ వాళ్ళ తలరాతలు కనలేం కదా" అనే సామెత హీరో నాగార్జున విషయంలో అక్షరాలా నిజమైందని అంటున్నారు అందరూ ... మొదటి పెళ్ళాం కొడుకు నాగ చైతన్య ఇప్పటికే లవ్ లో పడినట్లు అదికూడా హీరోయిన్ సమంత తోనేనని అంటున్నారు. ఈ విషయమై చిలవలు పలవలుగా వార్తలు వస్తున్నాయి. అసలు వీరి ప్రేమకు నాగ్ ఒప్పుకోవడంలేదని కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇది చాలదన్నట్లు రెండో భార్య అమల కొడుకు అఖిల్ కూడా ఇప్పుడు డిజైనర్ లవ్ లో పడినట్లు వార్తలు రావడం తో నాగ్ పైకి చెప్పలేక , మింగలేక అన్నట్లు ఉంటున్నాడని ఫిల్మ్ నగర్ లో గుసగుసలు ... అయితే ఇద్దరు కొడుకులు హేండివ్వడాన్ని మాత్రం నాగ్ జీర్ణించుకోలేక పోతున్నారని కొందరు సన్నిహితులు అంటున్నారట. అయితే అసలు నాగ్ ఇలాంటి విషయాల్లో చాలా పాజిటివ్ గానే ఉంటాడని కావాలనే నాగ్ మీద లేనిపోని రాతలు రాస్తున్నారని కొందరు సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారని చెబుతున్నారు, అసలు నాగ్ గురించి డీప్ గా తెలుసున్న వాళ్ళెవరూ ఇలాంటి అబాండాలు వేయరని అంటున్నారు. ఏది ఏమైనా త్వరలోనే నాగ్ వైఖరి ఏమిటో తెలుస్తుందని అంటున్నారు. అయితే అప్పటివరకూ రూమర్స్ ప్రభావం ఇంకా పెరుగుతుందో , తగ్గుతుందో చూడాలి.

ఇది కూడా చూడండి: డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఇది కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్‌ లో అరుదైన శివలింగం

ఇది కూడా చూడండి: చేతులతో ఇలా చేయగలరా మీరు ?

English summary

Nagarjuna both sons fall in love. Naga Chaitanya fall in love with top heroin samantha and akhil fall in love with designer sriya.