నాగ్ అన్నయ్యా అని పిలిచేది ఈయన్నే!

Nagarjuna Calls Harikrishna As Brother

05:41 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Nagarjuna Calls Harikrishna As Brother

అవును. సొంత అన్నయ్యను కూడా పేరు పెట్టి పిలిచే నాగార్జున ఈయన్ని మాత్రం మనసారా అన్నయ్యా అని పిలుస్తారట. అది కూడా ఈయన ఒక్కరినే. ఈయనే ఎన్ టి ఆర్ కుమారుడు హరికృష్ణ. ఇంతకీ విషయమేమంటే, నాగార్జున మా టివిలో నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాల్టీ షోలో హరికృష్ణ కుమారుడు ఎన్టిఆర్ పాల్గొని 12న్నర లక్షలు గెలుచుకున్నాడు. ఈ షో లో సరదాగా చాలా ముచ్చట్లు సాగాయి.

ఆ సందర్భంగా నాగ్ ని జూనియర్ బాబాయ్ అని సంభోదిస్తూ వుంటే, 'నేను కూడా మీ నాన్న గారిని అన్నయ్యా అని పిలుస్తూ వుంటాను. సీతారామరాజు సినిమాలో అన్నదమ్ములుగా నటించిన నాటి నుంచి ఇలా పిలవడం బాగా అలవాటైంది. నిజానికి మా అన్నయ్య వెంకట్ అక్కినేని ని కూడా వెంకట్ అనే పిలుస్తాను' అంటూ నాగ్ చెప్పేసరికి జూనియర్ సంబరపడిపోయాడు.

English summary

King Akkineni Nagarjuna Says that he will calls Nandamoori Hari Krishna As Brother. This was said by nagarjuna in meelo evaru koteeswarudu show