నూతన నటులకు నాగ్ బంపరాఫర్

Nagarjuna cast call for interested actors

01:26 PM ON 28th July, 2016 By Mirchi Vilas

Nagarjuna cast call for interested actors

సినీ ఫీల్డ్ కి వెళ్లి ఒక్క ఛాన్స్ కోసం అష్టకష్టాలు పడాల్సిన అవసరం లేకుండా, కేవలం నటనపై ఆసక్తి ఉంటే చాలు. సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లే. ఇది నిజంగా ఔత్సాహిక నటులకు శుభవార్త. ఇంతకీ విషయం ఏమంటే, తనతో నటించాలనుకునే ఔత్సాహిక నటులకు టాలీవుడ్ హీరో నాగార్జున బంపరాఫర్ ఇస్తున్నాడు. తనతో నటించాలనుకునే వాళ్లు talent@annapurnastudios.com అనే ఐడీకి మెయిల్ చేయాలని ఆహ్వానిస్తున్నాడు. ప్రస్తుతం నాగార్జున.. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న 'నిర్మలా కాన్వెంట్' చిత్రంలో ప్రత్యేక పాత్రలో పోషించడంతో పాటు ఈ చిత్రానికి మ్యాట్రిక్స్ టీం వర్క్స్ తో కలిసి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నా డు.

మరోవైపు హాథిరామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా దర్శకేంద్రుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో కూడా నాగార్జున నటిస్తున్నారు. అయితే, నాగార్జున కాస్టింగ్ కాల్ ఈ రెండు చిత్రాల కోసమేనా లేకుంటే, మరో కొత్త చిత్రం కోసమా అనేది స్పష్టం చేయలేదు. టాలెంట్ కలిగి ఉండి, నటించాలని ఆసక్తి కలిగిన అన్ని వయసుల వాళ్లు తనకు మెయిల్ చేయాలని నాగార్జున అంటున్నాడు.

English summary

Nagarjuna cast call for interested actors