ఆ లెటర్ తో ఫుల్ జోష్ మీద నాగార్జున...

Nagarjuna excited with that letter

04:17 PM ON 14th October, 2016 By Mirchi Vilas

Nagarjuna excited with that letter

పుత్రోత్సాహం అంతా ఇంతా కాదు. అది ఇప్పుడు ఓ తండ్రిగా అక్కినేని నాగార్జునకి బాగా తెల్సింది. అందుకే తెగ ఖుషీ అవుతున్నాడు. ఇంతకీ విషయం ఏమంటే నాగచైతన్య నటించిన 'ప్రేమమ్' సినిమా హిట్ అవ్వడమే. ఈ మూవీ హిట్ టాక్ నాగ్ కి వేయి ఏనుగుల బలాన్నిస్తోంది. చాలాకాలంగా బంపర్ హిట్ కోసం కళ్లు కాయలు కాసేలా ప్రయత్నిస్తోన్న నాగచైతన్యకు 'ప్రేమమ్' రూపంలో ఎంతో ఉపశమనం కలిగింది. ఈ సినిమాకి వస్తోన్న కాంప్లిమెంట్స్ చూసి సమంతా సహా టోటల్ అక్కినేని ఫ్యామిలీ ఫుల్ ఖుషీలో ఉంది. అంతేకాదు, అన్నమయ్య, శ్రీ రామదాసు, ఓం నమో వేంకటేశాయ చిత్రాలకు రచయితగా పని చేసిన జె.కె. భారవి అక్కినేని నాగార్జునకు చైతు గురించి లెటర్ కూడా నాగ్ కు చాలా హ్యాపీనిచ్చింది.

ఇప్పటివరకూ చైతు చేసిన అన్ని సినిమాల్లో కన్నా ప్రేమమ్ లో అద్భుతమైన పరిణతితో నటించిన విధానాన్ని గమనించాను. పరిపూర్ణ నటుడిగా ఈ చిత్రంతో నిరూపించుకున్నాడు.. తాతగారి పక్కన.. మీ పక్కన నిలబడే యోగ్యతను సంపాదించుకున్నాడని భారవి చెప్పడం నాగ్ లో ఫుల్ జోష్ నింపింది.

English summary

Nagarjuna excited with that letter