నాగార్జునతో కన్నీళ్లు పెట్టించిన చైతూ(వీడియో)

Nagarjuna gets emotional after listening Sahasame Swasaga Sagipo songs

04:52 PM ON 20th June, 2016 By Mirchi Vilas

Nagarjuna gets emotional after listening Sahasame Swasaga Sagipo songs

ఒక్కోసారి కొన్ని కొన్ని సినిమాలూ.. వాటిలోని సన్నివేశాలు.. చాలామందిని రియల్ లైఫ్ లో చాలా ప్రభావితం చేస్తుంటాయి. ఒక్కోసారి ఆల్రెడీ సినిమాల్లో చేస్తున్న హీరోలే.. ఆ సన్నివేశాలన్నీ నిజంకాదని తెలిసినా కూడా.. బాగా ఏడ్చేస్తారు. అంటే కొన్నిసార్లు ఎమోషనల్ గా అలా కనక్ట్ అయిపోతారన్న మాట. ఇక సన్నివేశాలకే కాదు.. అలాంటి స్ర్టెంగ్త్ పాటలకు కూడా ఉంటుంది. తొలిసారిగా సాహసం శ్వాసగా సాగిపో పాటలను వింటున్నప్పుడు కింగ్ నాగార్జున పరిస్థితి కూడా అంతేనట. అసలే ఏ.ఆర్.రెహమాన్ స్వరపరిచిన పాటలు కాబట్టి.. ఖచ్చితంగా ఎలా ఉంటాయో వినేద్దాం అనే ఆతృత ఎవరికైనా ఉంటుంది.

నాగ్ కూడా అలాగే చైతన్య ఇచ్చిన సిడిని పెట్టుకుని పాటలు వింటున్నాడట. ఇంతలో సడన్ గా తన రూమ్ లోనికి వచ్చిన అమల.. ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగిందట. వెళ్లిపోమాకే సాంగ్ వింటుంటే కళ్లలో నీళ్లు వచ్చేశాయి. సాంగ్స్ వింటుంటే ఎక్కడికో వెళ్లిపోతాం. ఈ సినిమాలో పాటలన్నీ అలాగే ఉన్నాయి అని చెబుతూ.. తాను ఎంతగా కనెక్ట్ అయ్యానో వివరించే ప్రయత్నం చేశారు నాగార్జున. కాకపోతే ఇలాంటి రొమాంటిక్ మరియు మూడీ పాటలను మిస్ అవుతున్నందకు బాధగా ఉందని ఫీలయ్యాడు నాగ్. ఇక 30 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా రెహమాన్ మ్యూజిక్ లో ఒక్క సినిమా(రక్షకుడు) మాత్రమే చేశానని..

అయితే చైతూ మాత్రం అప్పుడే రెండు సినిమాలు చేసేశాడని.. ఆ చిన్న ప్రొఫెషనల్ జెలసీ చూపిస్తూనే.. తండ్రిగా తాను ఎంత ఆనందంగా ఉన్నాడో ప్రూవ్ చేసాడు నాగ్. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించగా మంజిమ మోహన్ కధానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. తమిళ వెర్షన్ లో శింబు హీరోగా నటించగా, తెలుగు వెర్షన్ లో మాత్రం చైతూ నటించాడు. రెండు వెర్షన్స్ లో మాత్రం మంజిమ మోహన్ హీరోయిన్ గా నటించింది. జూలై 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

English summary

Nagarjuna gets emotional after listening Sahasame Swasaga Sagipo songs