ఉమాకాంత్ కి షాక్ ఇచ్చిన నాగ్

Nagarjuna Golden Offer To Umakanth

03:00 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Nagarjuna Golden Offer To Umakanth

సినీ పరిశ్రమకు మరో టీచర్ రాబోతున్నాడు. ఇప్పటికే గోదావరి జిల్లాలకు చెందిన హాస్యనటులు బ్రహ్మానందం ,స్వర్గీయ ఎం.ఎస్.నారాయణ హాస్యనటులుగా తడాఖా చూపించారు. బ్రహ్మానందం ఇంకా రాణిస్తున్నాడు. ఇక వైరేటీ సినిమాలు తీసే దర్శకుడు సుకుమార్ కూడా గోదావరి జిల్లా లెక్కల మాస్టారే. ఇప్పుడు గోదావరి జిల్లా నుంచి మరో మాస్టారు సినిమాల్లో కనిపించబోతున్నాడు. ఇంతకీ ఇతన్ని సినీ రంగ ప్రవేశం చేయిస్తున్నది సాక్షాత్తూ నాగార్జునే. ఇటీవలే సోగ్గాడే చిన్ని నాయన చిత్రం విజయంతో జోష్ మీదున్న నాగ్ దీనికి సీక్వెల్ గా బంగార్రాజు కూడా తీసేందుకు సిద్ధమయ్యాడని అంటున్నారు.

ఇక హీరో శ్రీకాంత్ తనయుడుని హీరోగా పరిచయం చేస్తూ, 'నిర్మాలా కాన్వెంట్' చిత్రం తీస్తున్న నాగ్, ఈ సినిమాలో ' మీలో ఎవరు కోటీశ్వరుడు' రియాల్టీ షోలో పన్నెండున్నర లక్షలు గెలుచుకున్న టీచర్ ఉమాకాంత్ ని పరిచయం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ షోలో తొలి విడత ప్రోగ్రాంలో గోదావరి జిల్లాకు చెందిన ఉమాకాంత్ పాల్గొని, నాగ్ అడిగే ప్రశ్నలకు టక టకా సమాధానాలు ఇచ్చి , అబ్బుర పరిచాడు. అప్పట్లోనే నాగ్ ని ఆకర్షించిన ఉమాకాంత్ ని దృష్టిలో ఉంచుకుని, అందుకు తగ్గ పాత్రను డిజైన్ చేసి, అది కూడా టీచర్ రోల్ నే ఉమాకాంత్ కి ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు.

రియాల్టీ షోలో పరిచయమైనా, నిజమైన షోలో అదికూడా తాను తీయబోయే సినిమాలో రోల్ రూపొందించి గోల్డెన్ ఆఫర్ ఇవ్వడంతో ఉమాకాంత్ ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడట. మరి ఉమాకాంత్ తో నాగ్ సరి పెట్టేస్తాడా , ఇంకా ఆ షోలో పాల్గొన్న వాళ్లకు కూడా ఏమైనా పాత్రలు తదుపరి సినిమాల్లో డిజైన్ చేయించి ఆఫర్ ఇస్తాడా ... వేచి చూడాలి.

English summary

Umakanth a teacher who belongs to East Godavari District was previously attracted people including Nagarjuna in Meelo Evaru Kotteswarudu Tv Show.In that he used say answers without options and he won 12.5 lakhs.Nagarjuna gave an offer to Umakanth to as a actor to act in Nagarjuna's "Nirmala Convent" movie.