నాగ్ పై పూల వర్షం.. భారీ ఫాలోయింగ్

Nagarjuna has heavy fan following

09:41 AM ON 22nd April, 2016 By Mirchi Vilas

Nagarjuna has heavy fan following

సినీ జనాలు ఓ సారి అభిమానించడం మొదలు పెడితే, చివరిదాకా అది కొనసాగిస్తారు. అందుకే నాగార్జునకు యమ ఫాలోయింగ్ ఉంది... ప్రస్తుతం తెలుగు స్టార్‌ హీరోలు అనగానే యంగ్‌ హీరోల పేర్లు మాత్రమే వినిపిస్తాయి. ఇక ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉన్న పేర్లు అంటే పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ల పేర్లు ముందు వినిపిస్తాయి. అయితే నాగార్జునకు అంతగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ లేదు అని అంటూ ఉంటారు. అయితే నాగార్జునకు కూడా యంగ్‌ స్టార్‌ హీరోలకు ఉన్న స్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందని తాజాగా రుజువు అయ్యింది. నాగార్జునకు ఉన్న ఫ్యాన్స్‌ వల్ల రోడ్ల మీద మూడు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

వివరాల్లోకి వెళ్తే, నాగార్జున నిర్మిస్తున్న ‘నిర్మలా కాన్వెంట్‌’ చిత్రంతో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో నాగార్జున చిన్న గెస్ట్‌ రోల్‌ చేస్తున్నాడు. ఆ సీన్స్‌ షూట్‌ కోసం కాకినాడ సమీపంలోని పందుర్‌ అనే గ్రామంకు వెళ్లాడు. అక్కడ నాగార్జునకు దక్కిన స్వాగతం అపూర్వం అనే చెప్పాలి. మూడు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్‌ స్తంభించేలా ఫ్యాన్స్‌ కోళాహలం కనిపించింది. నాగార్జున పై పూల వర్షం కురిసింది. భారీ స్థాయిలో ఫ్యాన్స్‌ అక్కడకు చేరుకోవడంతో నాగార్జున సైతం షాక్‌ అయ్యాడు. దీంతో కుర్ర హీరోలను తలదన్నే ఫ్యాన్ ఫాలోయింగ్ నాగ్ కి ఉందని తేలిపోయింది.

English summary

Nagarjuna has heavy fan following. Akkineni Nagarjuna is playing a small guest role in Nirmala Convent movie. For that he came to Kakinada yesterday. At their fans came to see Nagarjuna heavily. Nirmala Convent movie is producing by Nagarjuna.