నాగార్జునకి అవమానం జరిగిందా...

Nagarjuna insulted by Potluri Vara Prasad

03:28 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Nagarjuna insulted by Potluri Vara Prasad

సోగ్గాడే చిన్నినాయనా చిత్రం తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు అక్కినేని నాగార్జున. ఇరవై ఐదు ఏళ్ళ క్రితమే తమిళనాడులో సంచలనం సృష్టించిన ఘనత నాగార్జునకు ఉంది. గీతాంజలి, శివ చిత్రాలతో నాగార్జున నటనకు ఒక గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఈ చిత్రాలతో తమిళనాడు లో సంచలనాలను సృష్టించాడు నాగార్జున. అప్పటి నుండి నాగార్జునకి మంచి డిమాండ్‌ పెరిగింది. దాంతో నాగార్జున చాలా సినిమాలు తమిళంలో డబ్‌ అయ్యాయి. తమిళ నాట కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ్‌ .

ప్రస్తుతం రిలీజ్‌కి రెడీగా ఉన్న నాగ్‌ చిత్రం ఊపిరి. తెలుగు, తమిళంలో రూపొందిన ఊపిరి చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషించారు. అలాగే కార్తీ, తమన్నాలు కూడా నటించారు. ఇదిలా ఉండగా తమిళనాడులో ప్రమోషన్‌ కోసం అక్కడ కార్తీ, తమన్నాలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాత పివిపి నాగార్జునని పట్టించుకోవడం లేదు. కార్తీ, తమన్నాలకు మార్కెట్‌ ఉండడంతో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విషయంలో నాగ్‌ పీలయ్యాడట. ఊపిరి చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయడానికి భారీగా సన్నాహాలు చేస్తున్నారు కానీ నాగ్‌ని మాత్రం పట్టించుకోవడం లేదు తమిళంలో. ఇలా చేస్తే బాధగానే ఉంటుంది కదా మరి.. నాగార్జున పరిస్థితి కూడా అదే....

English summary

Akkineni Nagarjuna is not happy with the producers of the movie Potluri Vara Prasad and the reason behind is promotion of the movie in Tamil Nadu.