సైమాలో సమంత చేసిన దానికి నాగ్ అసహనం

Nagarjuna intolerance about Samantha

04:22 PM ON 2nd July, 2016 By Mirchi Vilas

Nagarjuna intolerance about Samantha

అక్కినేని నాగార్జున కుటుంబంలోకి సమంత పెద్ద కోడలిగా వెళ్తుందన్న వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సింగపూర్ లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలలో సమంత చేసిన రచ్చ పై నాగార్జున తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. ఒకవైపు నాగ్ కి ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా నాగచైతన్య కోసం ఈ పెళ్లికి ఒప్పుకుని తన అంగీకారాన్ని అధికారికంగా అనౌన్స్ చెయ్యాలని నాగ్ సిద్ధపడుతుంటే సమంత మాత్రం సైమా అవార్డ్స్ వేడుకలలో అతిగా ప్రవర్తించడం నాగార్జునకు ఏమాత్రం నచ్చలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో తన ఎద అందాలను బయట పెడుతూ అక్కడున్న సెలెబ్రిటీలతో అతిగా మాట్లాడుతూ కనిపించడంతో నాగ్ తీవ్ర అసహనంగా ఉన్నారట.

సమంత ఈ లుక్ లో కాకుండా కొంచెం సాంప్రదాయంగా వచ్చి ఉంటే బాగుండేదని సైమా అవార్డ్స్ వేడుకకు వచ్చిన కొందరు ప్రముఖులు కామెంట్స్ చేసినట్లు టాక్. ఆ వేడుకకి వచ్చిన సమంత బన్నీ రానాల మధ్య కూర్చుని సైమాలో యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియా అవార్డును అందుకునే సందర్భంలో వీరు ముగ్గురు ఒకచోటే కూర్చుని చేసిన హాట్ హంగామా సైమా అవార్డ్స్ వేడుకకు హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తలు నాగ్ దృష్టి వరకు వెళ్లడంతో నాగ్ అసహనంలో ఉన్నారని టాక్.

English summary

Nagarjuna intolerance about Samantha