మహేష్ ఋణం తీర్చుకుంటున్న నాగ్

Nagarjuna is the chief guest for Brahmotsavam movie

12:07 PM ON 27th April, 2016 By Mirchi Vilas

Nagarjuna is the chief guest for Brahmotsavam movie

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. మహేష్ బాబుతో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పివిపి సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత, కాజల్ అగర్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ మొత్తం దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో ని ముందుగా మే 1వ తేదీన తిరుపతిలో రిలీజ్ చెయ్యాలని భావించిన చిత్ర టీం తరువాత మే 6న విడుదల చెయ్యడానికి డిసైడ్ చేసారు. ఈ చిత్రానికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా రాబోతున్నారు.

గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన 'రాజకుమారుడు' చిత్రం ఆడియో కి నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఆ తరువాత అక్కినేని నాగార్జున నట వారసుడు అఖిల్ ఎంట్రీ చిత్రం 'అఖిల్' చిత్రం ఆడియో కి మహేష్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇప్పుడు తాజాగా నాగార్జున మహేష్ 'బ్రహ్మోత్సవం' చిత్రం ఆడియో కి వచ్చి మహేష్ ఋణం తీర్చుకోబోతున్నాడు. అంతే కాదు ఇటీవలే నాగార్జున పివిపి బ్యానర్ లో 'ఊపిరి' చిత్రంలో నటించాడు ఆ బ్యానర్ మీద గౌరవంతో నాగార్జున ముఖ్య అతిధిగా రాబోతున్నాడు. అదీ అసలు సంగతి.. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.

English summary

Nagarjuna is the chief guest for Brahmotsavam movie. Nagarjuna is coming as a chief guest for Mahesh Babu Brahmotsavam movie.