చిరు-బాలయ్య గొడవకి నాగార్జునే కారణమా?

Nagarjuna is the reason for coldwar between Chiranjeevi and Balakrishna

11:07 AM ON 11th March, 2016 By Mirchi Vilas

Nagarjuna is the reason for coldwar between Chiranjeevi and Balakrishna

చాలా కాలం చిరు-బాలయ్య మధ్య కోల్డ్‌వార్‌ కొనసాగింది. అయితే ఆ తరువాత వీరిద్దరూ మళ్లీ కలిసిపోయారు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఒక గొడవ తలెత్తింది. అదేంటంటే ఇటీవలే లేపాక్షి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లేపాక్షి ఉత్సవాలకి చిరుని ఆహ్వానిస్తున్నారా అని అడిగితే చిరంజీవిని పిలవడం లేదు అని చెప్పడంతో చిరంజీవికి, చిరు కుటుంబానికి, చిరు అభిమానులకి బాగా కాలింది. దీనితో బాలకృష్ణ ఇటువంటి మాటలు మాట్లాడడం మానుకోడా అని అనుకున్నారంతా. అయితే బాలకృష్ణ అలా మాట్లాడడానికి ఒక కారణం ఉందట. ఆ కారణమే అక్కినేని నాగార్జున.

అసలు విషయంలోకి వస్తే ఇటీవల ఫిలింనగర్‌లో నూతనంగా కొన్ని దేవాలయాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ దేవాలయాల్లో ఒకటైన నరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవం బాలయ్య చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉందట. దాని కోసం దేవస్థానం కమిటీ చైర్మన్‌ మురళీమోహన్‌ బాలయ్యతో పాటు నాగార్జునాని కూడా ఆహ్వానించాడట. దీనితో ఆగ్రహం చెందిన బాలయ్య ఆ దేవస్థానం ప్రాంభోత్సవానికి రాలేదట. అందుకే లేపాక్షి ఉత్సవాలకి చిరుని పిలిచారా అంటే ఎవర్నీ పిలవను అని బాలయ్య అంతగా ఆగ్రహించాడు.

English summary

Akkineni Nagarjuna is the reason for coldwar between Megastar Chiranjeevi and Nandamuri Balakrishna.