నిర్మలా కాన్వెంట్ లో నాగ్ లుక్ అదిరిపోయిందిగా!

Nagarjuna look in Nirmala Convent

03:40 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

Nagarjuna look in Nirmala Convent

సినీ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ తెరంగేట్రం చేస్తూ హీరోగా నటిస్తున్న తొలిచిత్రం నిర్మలా కాన్వెంట్ లో కింగ్ నాగార్జున అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో పాట చిత్రీకరణ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రోషన్, శ్రేయ శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగ కోటేశ్వరరావు దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

కాగా 'ఊపిరి' చిత్రం తర్వాత నాగార్జున రెండు నెలల విరామం తీసుకుని నిర్మలా కాన్వెంట్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం నాగ్, ఓం నమో వెంకటేశా చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సన్నద్ధమవుతున్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించనున్నఈ చిత్రం షూటింగ్ ఈనెల 25న ప్రారంభంకానుంది.

English summary

Nagarjuna look in Nirmala Convent