మాట తప్పిన నాగ్‌

Nagarjuna movie Oopiri released at 1200 theaters

11:33 AM ON 22nd March, 2016 By Mirchi Vilas

Nagarjuna movie  Oopiri released at 1200 theaters

టాలీవుడ్‌ గ్రీకు వీరుడు నాగార్జున. ఇటీవలె సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో సూపర్‌ హిట్‌ సాధించి బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించాడు. ఈ చిత్రం తర్వాత నాగార్జున మైండ్‌ సెట్‌ మారిపొయిందని అంటున్నారు. సోగ్గాడే చిన్నినాయనా విడుదల సమయంలో నాగార్జున మీడియాతో మాట్లాడుతూ 'సంక్రాంతి సీజన్‌లో చాలా చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ నాకు ఇబ్బందిలేదు, ఎందుకంటే నాకు ఎలాంటి ధియేటర్ల సమస్య రాదని నాకు తెలుసు, నా రేంజ్‌ కి కేవలం 600 ధియేటర్లు చాలు' అని చెప్పాడు.

కానీ ఈ చిత్రం విజయం సాధించి నాగ్‌ క్రేజ్‌ ని మరింత పెంచింది. ప్రస్తుతం మార్చి 25న విడుదలకు రెడీ అవుతున్న చిత్రం ఊపిరి. ఈ చిత్రం తెలుగు, తమిళంలో కలిపి ఏకంగా 2000 ధియేటర్లలో విడుదల చేయాలని పివిపి సంస్థ ప్లాన్‌ చేస్తుంది. తమిళంలో కార్తీకి ఉన్న ఇమేజ్‌ పరంగా 600 ల ధియేటర్లలో, ఓవర్‌ సీన్‌లో 100 ధియేటర్లలో మాత్రమే విడుదల చేయనున్నారు. కానీ మన్మధుడికి ఇక్కడున్న క్రేజ్‌ దృష్యా 1200 నుండి 1300 వరకు ధియేటర్లలో ఊపిరి విడుదల చేయనున్నారు.

తనకు 600 ధియేటర్లు చాలని ఇదివరకు చెప్పిన నాగార్జున ఊపిరి చిత్రానికి దానికి డబుల్‌ ధియేటర్ల పై విడుదల చేయడం పై ఎలా స్పందిస్తాడో చూడాలిమరి. ఇటీవల బన్ని చిత్రంలో నాగార్జున కీ రోల్‌ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజం కాదని నాగ్‌ తేల్చి చెప్పాడు. తను ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న 'నమో వెంకటేశాయ' సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్‌ బంగార్రాజు చిత్రాలు మాత్రమే చేస్తున్నట్లు తెలిపారు.

English summary

Nagarjuna movie Oopiri released at 1200 theaters. Oopiri is a multi-starer featuring Nagarjuna and Karthi in the lead roles while Tamannaah is playing the love interest of Karthi in the movie.