చిరు మరో రేంజ్ కి తీసికెళ్తాడన్న నాగ్!

Nagarjuna praises Chiranjeevi

01:09 PM ON 10th September, 2016 By Mirchi Vilas

Nagarjuna praises Chiranjeevi

'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాం అనగానే హీరో నాగార్జున గుర్తొస్తాడు. తెలుగు టెలివిజన్ చరిత్రలో ఓ మైలురాయిగా నిల్చి, ఇంతకుముందెన్నడూ లేని టీఆర్పీ రేటింగ్ సాధించింది ఈ కార్యక్రమం. ఈ ప్రోగ్రాం అంత పెద్ద సక్సెస్ కావడంలో నాగార్జునది కీలక పాత్ర. అయితే మూడు సీజన్లను విజయవంతంగా నడిపించిన నాగ్, అనూహ్యంగా నాలుగో సీజన్ కు దూరమైపోయాడు. ఆ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి వస్తున్నాడు. అయితే ఇది ప్రోగ్రాం మేలు కోసం తీసుకున్న నిర్ణయమే అని.. చిరంజీవి ఈ కార్యక్రమాన్ని మరో రేంజ్ కి తీసుకెళ్తాడని నాగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఇన్నేళ్లలో సినిమాల ద్వారా ఎంత ఆదరణ సంపాదించుకున్నానో.. అంత ఆదరణ ఈ ప్రోగ్రాంతో దక్కింది.

'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాంతో నాకు ఎమోషనల్ కనెక్ట్ ఉంది. అది నా జీవితంలో ఓ కీలక మలుపు. అయితే సమయానికి తగ్గట్లు మనం ముందుకు వెళ్లిపోవాలి. షో సూపర్ సక్సెస్ అయినపుడే నిష్క్రమించడం మంచిదే. చిరంజీవి గారు నా స్థానంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ షోను మరో స్థాయికి తీసుకెళ్తారు అని నాగ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సినిమాలతో తాను తీరిక లేకుండా ఉన్నానని.. తన కొడుకులిద్దరితో ఒకేసారి సినిమాలు నిర్మించనుండటంతో తనపై బాధ్యత పెరిగిందని నాగ్ అన్నాడు. కొడుకులిద్దరికీ సొంత బేనర్లో మంచి సినిమాలు అందిస్తానని మాటిచ్చినందున, ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి వాళ్లిద్దరితో ఒకేసారి సినిమాలు నిర్మించబోతున్నానని, అవి కచ్చితంగా పెద్ద విజయాలు సాధిస్తాయని నాగ్ చెప్పాడు. మొత్తానికి ఈ కార్యక్రమానికి మార్పుకి కారణం నాగ్ బానే విశ్లేషించాడని అంటున్నారు.

ఇది కూడా చదవండి: పవన్ తడబడ్డాడా - స్క్రిప్ట్ తేడాయా ?

ఇది కూడా చదవండి: ఈ డియోడరెంట్ కొట్టుకుంటే క్యాన్సర్ వచ్చినట్టే!

ఇది కూడా చదవండి: శివుని అర్ధనారీశ్వర రూపం వెనుక అసలు రహస్యం ఇదే!

English summary

Nagarjuna praises Chiranjeevi. Nagajuna praises Chiranjeevi for he is hosting for season 4 of Meelo Evaru Koteeswarudu.