సోగ్గాడు సీక్వెల్‌ కి సిద్దమౌతున్నాడు!!

Nagarjuna ready to act in Soggade Chinni Nayana sequeal

06:39 PM ON 29th January, 2016 By Mirchi Vilas

Nagarjuna ready to act in Soggade Chinni Nayana sequeal

అక్కినేని నాగార్జున తాజా చిత్రం సోగ్గాడే చిన్నినాయనా సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా 35 కోట్ల మార్క్‌ను క్రాస్‌ చేసి 40 కోట్ల దిశగా పరుగులు తీస్తుంది. ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రిభినయం చేశాడు. బంగార్రాజు పాత్రలో అయితే నాగార్జున అదరగొట్టేసాడు. బంగార్రాజు పాత్ర ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'బంగార్రాజు' పాత్రను తీసుకుని కధని సిద్దం చెయ్యమని డైరెక్టర్‌ కళ్యాణ్‌ కృష్ణకు నాగార్జున సూచించాడని తెలుస్తోంది. మంచి కధతో వస్తే త్వరలోనే సినిమాను సిద్ధం చేద్దాం అంటూ నాగ్‌ దర్శకుడితో అన్నట్లు సమాచారం. ప్రస్తుతం డైరెక్టర్‌ కళ్యాణ్‌ కృష్ణ అదే పనిలో ఉన్నాడట.

English summary

Akkineni Nagarjuna latest sensation Soggade Chinni Nayana is block buster hit. Now Nagarjuna is ready to act in Soggade Chinni Nayana sequeal.