శ్రియ నే కావాలంటున్న నాగ్

Nagarjuna recommends Shriya for Oopiri

01:35 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Nagarjuna recommends Shriya for Oopiri

శ్రియ-నాగార్జున కలిసి నటించిన సినిమాలు అన్నీ హిట్‌ అయ్యాయి. ఈ సెంటిమెంట్‌ తోనే నాగ్‌ తన తాజా సినిమా 'ఊపిరి' లో ఒక కీ రోల్‌ కి శ్రియ ని ఎంపిక చేశాడని సమాచారం. రికమెండ్‌ చేసీ మరి శ్రియ ను ఎంచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కార్తీ, నాగార్జున కలిసి నటిస్తున్నారు. హాలీవుడ్‌ చిత్రం 'ది ఇంటచబల్స్‌' కి రీమేక్‌ గా ఊపిరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక ముఖ్య పాత్రలో అనుష్క-అడవి శేష్‌ జంటగా సినిమాలో కనిపించనున్నారు. నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' ఘన విజయం సాధించడంతో 'ఊపిరి' సినిమా పై అంచనాలు పెరిగాయి. శ్రియ-నాగ్‌ ల మధ్య ఉన్న సన్నివేశాలు రీసెంట్‌ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రియ, నాగ్‌ లు సెకండాఫ్‌లో కనువిందు చేయనున్నారు.

English summary

Nagarjuna recommends Shriya for Oopiri movie. Nagarjuna, Karthi, Tamanna and Shriya Saran were playing in lead roles. Vamsi Paidapally is directing this movie.