సొగ్గాడి సీక్వెల్ 'బంగార్రాజు'

Nagarjuna Registered Bangarraju Title

12:43 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Nagarjuna Registered Bangarraju Title

సినిమాలో వేసిన పాత్రనే టైటిల్ గా చేసుకుని, అది కూడా సీక్వెల్ గా నాగార్జున అక్కినేని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట. అందుకే ఇప్పుడు ‘బంగార్రాజు’ టైటిల్‌ని ఫిల్మ్‌ఛాంబర్‌లో నమోదు చేయించాడని వినికిడి. ఈ ఏడాది సంక్రాంతికి ‘సోగ్గాడు..’గా వచ్చి తన సత్తా మరోసారి చాటిన నాగార్జున. బంగార్రాజుగా నాగార్జున నటన, ఆయన స్టైల్‌, అన్నింటికీ మించి ముద్దుగుమ్మలతో నాగ్ రొమాన్స్ అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేయడంతో పాటూ దాదాపు రూ.50 కోట్ల వసూలు సాధించి నాగార్జున కెరీర్‌లోనే ఉత్తమ చిత్రం అయిపొయింది. . దాంతో ‘సోగ్గాడే చిన్నినాయన’ కథపై నాగ్‌కి ప్రేమ మరింత పెరిగిపోయింది. అందుకే . ఈ చిత్రాన్ని కొనసాగించాలని నాగ్‌ నిర్ణయించుకొన్నాడట. అదే సీక్వెల్ అన్నమాట. ‘సోగ్గాడే...’ కథలో బంగార్రాజు, రాము పాత్రల్లో కనిపింఛి, మెప్పించిన నాగ్‌. బంగార్రాజు మరణించిన తరవాత ఆత్మ రూపంలో భూమ్మీదకు వచ్చిన తరవాత ఏం జరిగింది? అనే విషయాన్ని చూపించగా, దానికి ముందు జరిగిన కథేంటి? అన్నది ‘బంగార్రాజు’లో చూపించబోతున్నాడట.. ఈ చిత్రానికి కూడా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి చిత్రం వచ్చి , అది సాధించిన విజయంతో వెనువెంటనే సీక్వెల్ కి మార్గం ఏర్పడిందంటే, ఎంత పగద్బందీగా ఈ చిత్రం రాబోతోందో వేరే చెప్పనవసరం లేదు

English summary

King Akkineni Nagarjuna was enjoying the success of his latest movie "Soggade Chinni Nayana".a news came to know that Nagarjuna was registered a title name "Bangarraju" in film chamber and Also Nagarjuna was going to make second part of Soggade Chinni Nayana Movie.